అన్వేషించండి

Movies Coming Out March 1: మార్చి 1 రేసులో మరో చిన్న సినిమా - థియేటర్లలోకి పల్లెటూరి ప్రేమకథ

మార్చి 1న తెలుగులో మినిమమ్ నాలుగైదు సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ రోజు థియేట్రికల్ రేసులో మరో చిన్న సినిమా చేరింది.

మార్చి 1న థియేటర్లలోకి రావడానికి తెలుగు సినిమాలు చాలా క్యూ కడుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' విడుదల కానుంది. వెన్నెల కిశోర్ హీరోగా తెరకెక్కిన కామెడీ స్పై థ్రిల్లర్ 'చారి 111' కూడా ఆ రోజే రానుంది. వీటితో పాటు అనసూయ ఓ పాత్రలో నటించిన 'రజాకార్', శివ కందుకూరి 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాలు ఉన్నాయి. ఇప్పుడీ లిస్టులో మరో చిన్న సినిమా చేరింది. 'రాధా మాధవం' సైతం ఆ రోజు విడుదల కానుంది.  

మార్చి 1న థియేటర్లలో 'రాధా మాధవం' విడుదల
వినాయక్ దేశాయ్ హీరోగా రూపొందిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'రాధా మాధవం'. అపర్ణ దేవి హీరోయిన్. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోనల్ వెంకటేష్ నిర్మాత. ఈ చిత్రానికి కథ, మాటలతో పాటు పాటలను కూడా వసంత్ వెంకట్ బాలా అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మార్చి 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు.

'రాధా మాధవం' చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్
'రాధా మాధవం' ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. చక్కని సందేశాత్మక చిత్రం తీశారని సెన్సార్ సభ్యులు ఇచ్చిన ప్రశంసలు తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని వారు పేర్కొన్నారు.

Also Read: భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

'రాధా మాధవం' సినిమా ఫస్ట్‌ లుక్‌ను కొన్ని రోజుల క్రితం రాజ్ కందకూరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ''హీరోగా వినాయక్‌ దేశాయ్ రెండో చిత్రమిది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే... మంచి పల్లెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగించింది. మన ప్రేక్షకులు చిన్నా పెద్దా అని తేడాలు చూడరు. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని చెప్పారు. తమను ఎంకరేజ్ చేస్తున్న రాజ్ కందుకూరికి హీరో వినాయక్ దేశాయ్ కృతజ్ఞతలు చెప్పారు.

Also Readఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత:  గోనాల్ వెంకటేష్, దర్శకత్వం: దాసరి ఇస్సాకు, కథ - మాటలు - పాటలు: వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, ఛాయాగ్రహణం: తాజ్ జీడీకే, కూర్పు: కె. రమేష్, పోరాటాలు: రాబిన్ సుబ్బు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: అమ్మఒడి, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
అమ్మఒడి, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: అమ్మఒడి, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
అమ్మఒడి, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
CMR Engineering College Issue: సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
Tirumala: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
Embed widget