Pushpa 2 Trailer Release Date: 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - అస్సలు తగ్గేది లేదు... ఆ రోజు నుంచి ఫైర్ వర్క్స్ మొదలు
Pushpa 2 Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీం రోజుకు ఒక అప్డేట్ ఇస్తోంది. ఈ రోజు 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫైర్, నీయవ్వ తగ్గేదేలే' - 'పుష్ప: ది రైజ్'లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన డైలాగ్. ఆ డైలాగుకు తగ్గట్టు బాక్స్ ఆఫీస్ బరిలో, అవార్డుల్లో సినిమా అస్సలు తగ్గలేదు. బన్నీకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టడంతో పాటు భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడు సీక్వెల్ సందడి చేసేందుకు రెడీ అయ్యింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ కానుంది.
నవంబర్ 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్!
క్రియేటివ్ జీనియస్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో 'పుష్ప ది రైజ్'కు సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా 'పుష్ప: ది రూల్'. ఈ మూవీ విడుదలకు ఇంకా పాతిక రోజుల సమయం కూడా లేదు. ఆల్రెడీ సినిమాపై క్రేజ్ పీక్ లెవల్‌లో ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళడానికి అన్నట్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Pushpa 2 Trailer Release Date: నవంబర్ 17న పాట్నాలో 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. అభిమానుల సమక్షంలో అక్కడ భారీ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేసింది.
View this post on Instagram
డిసెంబరు 5న బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ మొదలు!
Pushpa 2 The Rule Release Date: డిసెంబర్ 5న 'పుష్ప 2' థియేటర్లలోకి భారీ ఎత్తున రానున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విడుదలకు ఒక్క రోజు ముందు... అంటే డిసెంబర్ 4న అమెరికాలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఆ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ బరిలో కలెక్షన్స్ సునామీ మొదలు అవుతుందని యూనిట్ చెబుతోంది. ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం 'పుష్ప-2 ది రూల్' అవుతుందని అంటున్నారు.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమాను సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ తర్వాత కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సిటీల్లో భారీ మాసివ్ ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రజెంట్ షూటింగ్ చివరి దశలో ఉంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్, కమెడియన్ నుంచి విలన్ రోల్స్ చేయడానికి షిఫ్ట్ అయిన సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అన్నీ ఆయన ఇచ్చారు. ఆయనతో పాటు తమన్ రీ రికార్డింగ్ చేస్తున్నారు.