Pushpa Director Sukumar: ఇంట్లో పని అమ్మాయిని చదివించి గవర్నమెంట్ ఉద్యోగి చేసిన దర్శకుడు సుకుమార్
దర్శకుడు సుకుమార్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. తన ఇంటిలో సహాయం చేయడానికి ఒక పని మనిషిని ప్రభుత్వ ఉద్యోగి చేసిన అంశంలో ఆయనపై ప్రేక్షకుల్లో గౌరవం మరింత పెరిగింది.
డైరెక్టర్ సుకుమార్ తెరపై ఎంత గొప్పగా సినిమాలను ఆవిష్కరిస్తారో నిజ జీవితంలోనూ అంతే గొప్పగా బ్రతుకుతుంటారు. అందుకే ఆయనపై ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ రాదు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో తన అసిస్టెంట్లను డైరెక్టర్లగా మార్చి సినిమాలు తీసిన చరిత్ర అయనది. ఇప్పుడు తన ఇంట్లో పని చేసే అమ్మాయిని చదివించి గవర్నమెంట్ ఉద్యోగం సాధించే స్థాయికి ప్రోత్సహించిన అరుదైన ఘనత సుకుమార్, ఆయన భార్య తబిత సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో దివ్య అనే అమ్మాయి చాలా కాలంగా పని చేస్తుంది. ఒకపక్క హెల్పర్ గా పనిచేస్తూనే చదువు మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ను సుకుమార్ దంపతులు ఆమెను విధాలా ప్రోత్సహించారు. ఆ దంపతుల అండతో బాగా చదువుకున్న దివ్య ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఆ ఆనందాన్ని సుకుమార్ భార్య తబిత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ... తమ ముందే రెక్కలు విప్పుకుంటూ ఇలా ఉన్నత స్థాయికి వెళ్లిన దివ్యను చూసి ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సుకుమార్ అభిమానులు, నెటిజన్స్ దివ్యను, సుకుమార్ దంపతులను పొగుడుతున్నారు. సుకుమార్ ఫ్యామిలీలా సాయం చేసే వారి వల్ల ఎంతో మంది చిన్న స్థాయి నుంచి పైకి ఎదగగలుగుతున్నారంటూ అభినందనలు తెలుపుతున్నారు. గతంలో లెక్కలు మాస్టారుగా పని చేసిన సమయంలోనూ చాలా మంది పేద విద్యార్థులను ప్రోత్సహించిన చరిత్ర సుకుమార్ కు ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. డైరెక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ఇప్పటికీ ఆ లక్షణాన్ని కోల్పోలేదని వారు గర్వంగా చెబుతుంటారు.
View this post on Instagram
'పుష్ప 2: ది రూల్'కు దేశ వ్యాప్తంగా క్రేజ్!
పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ అయిన 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Pushpa 2 Director Sukumar)లకు ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. వారి కలయికలో వస్తున్న 'పుష్ప 2: ది రూల్'కు కళ్ళు చెదిరే క్రేజ్ ఉండడంతో బాలీవుడ్ సినిమాలు సైతం పుష్ప రిలీజ్ దగ్గరకు కాస్త దూరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న 'పుష్ప 2: ది రూల్' ఏకంగా 1000 కోట్లు దాటుతుంది అంటూ అంచనాలు ఉన్నాయి. ఇంతకు ముందు 'రంగస్థలం' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ను మార్చేసిన సుకుమార్ ఇప్పుడు 'పుష్ప 2'తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో అని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.