అన్వేషించండి

Anchor Shyamala: శ్యామల బెట్టింగ్ రాణి, ప్రజలు ఛీ అంటున్నారు.. పోసానికి ఇదే నా ఛాలెంజ్ - పృథ్విరాజ్

Prudhvi Raj: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో సీనియర్ ఆర్టిస్ట్ పృథ్విరాజ్.. జనసేన తరపున ప్రచారాల్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై విమర్శలు కురిపించారు.

Prudhvi Raj: ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. కౌంటర్స్, రీ కౌంటర్స్‌తో సోషల్ మీడియా నిండిపోతోంది. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎలక్షన్స్‌లో సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ప్రచారాల్లోకి దిగారు సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్. వైసీపీ నుంచి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ శ్యామల, మంత్రి రోజా ఉన్నారు. దీంతో తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో వైసీపీ, వైఎస్ జగన్ సపోర్టర్స్‌ను విమర్శిస్తూ పృథ్వి రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణమురళీని సైతం విమర్శిస్తూ పృథ్వి రాజ్ కౌంటర్స్ విసిరారు.

ఆడదానివి కాబట్టి వదిలేశాం..

రోజాను డైమండ్ రాణి అని సంభోదిస్తూ.. ‘‘ఆవిడ జనసైనికులను రెచ్చగొట్టడానికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పింది. చంద్రబాబును దరిద్రుడు అంటూ ఆయన జైలులో ఉంటే మరో దరిద్రుడు సపోర్ట్  చేశాడంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నువ్వు ఆడదానివి కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మేము వదిలేశాం. రోజా.. చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు మేము ఎవ్వరం చూడకూడదని గదిలో వెళ్లి కూర్చున్నాం. ఆయన మాత్రం ఆమెకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించి పంపిస్తే.. తరువాతి రోజే పవన్ కళ్యాణ్ గాడిదలాంటివాడు, 55 ఏళ్లు ఉన్నాయి అన్నది. నీకు కూడా 52 ఉన్నాయి కదా’’ అంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పృథ్వి రాజ్.

ఛీ అంటున్నారు..

దమ్ముంటే తిరుపతిలో ఒక మీటింగ్‌కు వచ్చి నిలబడమని పోసాని కృష్ణమురళికి ఛాలెంజ్ విసిరారు పృథ్వి రాజ్. ఆపై యాంకర్ శ్యామల గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ‘‘యాంకర్ శ్యామల అంట. ఆమె బెట్టింగ్ రాణి. బెట్టింగ్ యాప్స్‌కే యాంకరింగ్ చేస్తుంది. ఆమె వచ్చి వైజాగ్‌లో మాట్లాడుతుంటే మహిళలు అంతా ఛీ అంటున్నారు. రోడ్డు బ్రహ్మండంగా ఉన్నాయి, జగనన్న పాలన రామరాజ్యంలాగా ఉంది అంటుంటే.. పోసాని డైలాగులా.. ఏం మాట్లాడుతున్నావు రా.. నరాలు కట్ అయిపోయాయి.. అనుకుంటున్నారు ప్రజలు. వీటన్నింటికి చరమగీతం పడుతుంది’’ అంటూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఒక్కొక్కరిపై సీరియస్‌గా ఫైర్ అయ్యారు పృథ్వి రాజ్.

శ్యామలపై ఫోకస్..

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు.. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గానే నిలబడుతున్నారు. కానీ బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల మాత్రం వైసీపీకి సపోర్ట్‌గా ప్రచారాలు ప్రారంభించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతే కాకుండా వైసీపీ ప్రచారకర్తగా యాక్టివ్‌గా పాల్గొంటున్న శ్యామల.. పవన్ కళ్యాణ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు కురిపిస్తోంది. అంతే కాకుండా చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో ఆఫ్ స్క్రీన్ తనతో సన్నిహితంగా ఉండేవారు కూడా రాజకీయాల విషయానికి వచ్చేసరికి తనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. శ్యామల మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏపీ అంతా తిరుగుతూ వైసీపీకి సపోర్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. అంతే కాకుండా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభల్లో కూడా తను యాక్టివ్‌గా పాల్గొంటోంది. అందులో పృథ్వి రాజ్ కూడా యాడ్ అయ్యారు.

Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget