Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Bunny Vas Reaction : ఇడుపు కాయితం కాంట్రవర్సీపై నిర్మాత బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు. స్టోరీని బట్టే టైటిల్ ఉంటుందని... దాన్ని మార్చే ప్రసక్తే లేదని అన్నారు.

Producer Bunny Vas Reaction About Idupu Kayitham Title Controversy : ఇడుపు కాయితం... గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టైటిల్‌పైనే చర్చ సాగుతోంది. అసలు షూటింగ్ స్టార్ కాక ముందే కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే కాంట్రవర్సీ మొదలైంది. సినిమా భాష, యాస, టైటిల్ విషయంలో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి మరీ విమర్శలు, ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు.
'టైటిల్, స్టోరీ మార్చలేం'
ఏదైనా స్టోరీని బట్టే టైటిల్ ఉంటుందని... దాన్ని మార్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు బన్నీ వాస్. 'ఇడుపు కాయితం అనేది ఓ ప్రాంతానికే పరిమితమయ్యే కథ కాదు. కథను బట్టే టైటిల్ ఉంటుంది. దీనిపై ఇక చర్చ అనేది అనవసరం. షూటింగ్ పూర్తై విడుదలైన తర్వాత సినిమానే మాట్లాడుతుంది. ఎవరైనా నచ్చితేనే సినిమా చూస్తారు. సినిమాను బాగా తీయడంపై దృష్టి పెట్టడమే నేను చేస్తాను. ఈ వివాదం వల్ల సినిమాకు కొంత ఇబ్బంది కలిగింది.
సినిమా బాగుంటే అన్నీ సర్దుకుంటాయి. ఇది ఓ ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు. నాకు పూర్తి నమ్మకం కాదు. దర్శకుడు వచ్చిన ప్రాంతం, చూసిన వాస్తవ సంఘటనల నుంచి రాసుకున్న కథ ఇది. ఇది ప్రతీ ఇంట్లో ఉండే కథ. క్లైమాక్స్‌కు వచ్చే సరికి అత్తా కోడళ్లు, మామా అల్లుళ్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని బయటకు వస్తారు.' అని అన్నారు.
'అది ఆలోచించాలి'
ఏదైనా సినిమాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఓసారి ఆలోచించాలని హితవు పలికారు బన్నీ వాస్. 'మనం చేసే పోస్టులు ఏవైనా విభేదాలు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నటీనటులకు డైలీ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేయాలంటే చాలా కష్టం. అందుకే మేము కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నాం. నా బడ్జెట్‌కి నా పరిధిలోకి వచ్చే వారితోనే సినిమాలు చేస్తా.' అంటూ చెప్పారు.
ఇడుపు కాయితం అంటే?
'ఇడుపు కాయితం' అంటే అర్థం ఏంటి? సబ్ టైటిల్స్ పెడతారా? అంటూ ఓ నెజిటన్ చేసిన పోస్టు వద్ద ఈ వివాదం మొదలైంది. అసలు ఇడుపు కాయితం అంటే... భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం. అప్పటి రోజుల్లో విడిపోవాలనుకునే దంపతులు ఇలా పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకునేవారు. దీన్నే ఇడుపు కాయితం అని పిలిచేవారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 'ఇడుపు కాయితం' రాసుకొని విడిపోయిన జంటలున్నాయి.
మూవీ విషయానికొస్తే... యంగ్ హీరో ప్రియదర్శి, ఫేమస్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.
Also Read : Ram Charan : లండన్‌లో పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ - రామ్ చరణ్‌కు గ్లోబల్ ఫ్యాన్స్ సర్ప్రైజ్
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















