Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రెండు మూడు నెలల్లోనే 'స్పిరిట్' షూటింగ్.. ఆ రూమర్లకు ఫుల్ చెక్
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఆలస్యం అవుతుందనే రూమర్లకు చెక్ పెడుతూ.. 2, 3 నెలల్లోనే షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.

Prabhas Spirit Movie Shooting Starts Soon: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో 'స్పిరిట్' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అటు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2, 3 నెలల్లోనే షూటింగ్
ఈ సినిమా ఆలస్యం అవుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. మూవీ షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్స్ పంచుకున్నారు. 2, 3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2027లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఆ రూమర్లకు ఫుల్ చెక్
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'యానిమల్' మూవీకి సీక్వెల్‌గా 'యానిమల్ పార్క్' తెరకెక్కనుంది. అయితే, ఈ మూవీ తర్వాతే ప్రభాస్ 'స్పిరిట్' వస్తుందని.. మరింత ఆలస్యం తప్పదని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో ప్రభాస్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత భూషణ్ చెప్పడంతో ఆ రూమర్లకు ఫుల్ చెక్ పడినట్లయింది. సందీప్ వంగాతో సినిమా కంటే ముందే ప్రభాస్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. దానిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. మారుతి డైరెక్షన్‌లో రాజా సాబ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. ఫౌజీ కూడా లైనప్‌లో ఉంది. దీని తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. దీని కన్నా ముందే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో డార్లింగ్ గెస్ట్ రోల్ చేయనున్నారు.
స్పిరిట్.. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్
అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' ప్లాన్ చేశారు. సందీప్‌తో మూవీ అంటేనే హైప్ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అందుకే ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచీ స్టోరీపై ఆసక్తి నెలకొంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఛార్మింగ్ లేడీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బాలీవుడ్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లను కూడా సందీప్ ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ మూవీలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారనేలా వార్తలు మరింత జోష్ పెంచుతున్నారు. అయితే, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర కీలక రోల్స్ కోసం అమెరికాతో పాటు కొరియా నుంచి కూడా యాక్టర్స్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఈ మూవీని భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగాలతో కలిసి నిర్మిస్తున్నారు.






















