Teen Maar Re Release: పవన్ కల్యాణ్ 'తీన్ మార్' రీ రిలీజ్ - నిర్మాత బండ్ల గణేష్ ఫుల్ క్లారిటీ, అది సాధ్యమేనా అంటూ సందేహాలు!
Bandla Ganesh: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'తీన్ మార్' రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.

Producer Bandla Ganesh Comments On Pawan's Teen Maar Re Release: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోల ఒకప్పటి సినిమాలను ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుండగా మంచి స్పందన వస్తోంది. కాగా, అప్పుడు అంతగా సక్సెస్ కాలేకపోయిన సినిమాలు సైతం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అలా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ఓ స్పెషల్ మూవీ అంటే వినిపించే పేరు 'తీన్ మార్' (Teen Maar). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా జయంత్ పరంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం 2011లో విడుదలై అనుకున్నంత మేర విజయం సాధించ లేకపోయింది. హిందీ సినిమా 'లవ్ ఆజ్ కల్'కు ఈ సినిమా రీమేక్. అయితే, 'తీన్ మార్'లో త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ పాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్
అయితే, 'తీన్ మార్' రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ వాలెంటైన్స్ డే రోజున రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. తాజాగా.. ఈ సినిమాపై నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) స్పందించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన అభిమాని.. 'లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారు.? థియేటర్‌లో అసలు డైలాగులు వినిపించలేదు.' అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు స్పందించిన బండ్ల గణేష్.. 'కొత్తగా డబ్బింగ్ చెప్పి.. మళ్లీ మిక్సింగ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేస్తాను.' అంటూ ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. 'వాలెంటైన్స్ డే' రోజున రిలీజ్ చేయాలని. కోరుతున్నారు.
We will do new perfect dubbing and wonderful mixing after that, I will release 🙏 https://t.co/1UoBGR8tgZ
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
Also Read: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
'గుండెలకు హత్తుకునే సినిమా'
ఇటీవల కూడా బండ్ల గణేష్ 'తీన్ మార్' సినిమా గురించి మాట్లాడారు. 'తీన్ మార్ గుండెలకు హత్తుకునే సినిమా. చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నా. చిన్న చిన్న లోపాల వల్ల అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమాకు ఎందుకు ప్రేక్షకాదరణ రాలేదనేది నాకు మిలియన్ డాలర్ల ప్రశ్నే. 'తీన్ మార్'ను మళ్లీ అద్భుతంగా మార్చి మళ్లీ రీ రిలీజ్ చేస్తాను.' అని అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పడం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సినిమాలో మళ్లీ డబ్బింగ్, మిక్సింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మళ్లీ డబ్బింగ్‌లో ఏదైనా తేడా వస్తే.. ఆర్టిస్టులు చెప్తారా.? వారి డేట్లు ఇప్పుడు దొరుకుతాయా.? అనేదే అసలు ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ బండ్ల గణేష్ 'తీన్ మార్' రీ రిలీజ్‌పై పట్టుదలతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

