అన్వేషించండి

Priyanka Jain: తిరుమల ప్రతిష్టను దిగజార్చాలనుకోలేదు... బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సారీ చెప్పిన ప్రియాంక జైన్

తిరుమల ప్రతిష్టను దిగజార్చాలనుకోలేదు అంటూ తాజాగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రియాంక జైన్ ఒక వీడియోను విడుదల చేసింది. అసలు వివాదం ఏమిటి? ఎందుకు ఆవిడ సారీ చెప్పింది వంటి వివరాల్లోకి వెళితే...

సీరియల్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల తిరుమలలో ఓ ప్రాంక్ వీడియోను తీసి, వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేదాక వెళ్లడంతో తాజాగా ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఆ విషయం గురించి స్పందిస్తూ, అందరికీ సారీ చెప్పారు. 

సోషల్ మీడియాలో ప్రియాంక జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కలిసి రిలీజ్ చేసిన వీడియోలో వాళ్లిద్దరూ మాట్లాడుతూ "మేము చేసిన ఒక బ్లాగ్ శ్రీవారి భక్తులను హర్ట్ చేస్తుందని ఊహించలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వీడియో ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఈ వీడియో వల్ల ఇంతమంది హర్ట్ అవుతారనే విషయం తెలిస్తే చేసేవాళ్ళం కాదు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చాలని అనుకోలేదు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అంతే కాకుండా భక్తులలో భయం కలగడానికి ఆ వీడియో చేయలేదు. మేము ఇద్దరం శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులం. ఆ విషయం మీకు కూడా తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు, టీటీడీ పవిత్రను దెబ్బ తీయాలనే ఆలోచనతో ఈ వీడియోను మేము చేయలేదు. తెలియకుండా చేసిన ఈ తప్పును అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాము. ఆ వీడియో వల్ల మనోభావాలు దెబ్బ తిన్న ప్రతి ఒక్కరికి, శ్రీవారి భక్తులందరికీ ఈ సందర్భంగా మరొకసారి సారీ చెప్తున్నాము. సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేసే ప్రతీ వీడియో మిమ్మల్ని ఎంటర్టైనర్ చేయడానికి మాత్రమే. ఇలా జరిగి ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము" అంటూ ఆ వీడియోలో వెల్లడించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

అసలు వివాదం ఏమిటంటే... బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్, శివ కుమార్ రీసెంట్ గా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే నడక మార్గంలో ఉన్న ఏడో మైలురాయి వద్ద పులి అంటూ ఫ్రాంక్ వీడియోను చేశారు. అయితే అనుకోని విధంగా ఈ వీడియో వైరల్ గా మారడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. అలాగే శ్రీవారి భక్తులు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. పవిత్రమైన తిరుమలకు వచ్చి ఇలాంటి పనులు చేయడమేంటి అంటూ వీరిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక జైన్, శివ దీనిపై వీడియోను రిలీజ్ చేసి, తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ, ఎవ్వరి మనోభావాలను దెబ్బతీసే ఆలోచన తమకు లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక ప్రియాంక జైన్ మౌనరాగం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ లో నటించి, బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి టాప్-5లో నిలిచింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది ప్రియాంక. గత కొన్నేళ్లుగా వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అలాగే ఇద్దరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.

Read Also : Filmfare Winners List 2024 : సాయి దుర్గా తేజ్ 'సత్య'కి పీపుల్ ఛాయిస్ అవార్డ్... కంప్లీట్ ఫిల్మ్​ఫేర్ విన్నర్స్ లిస్ట్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Manchu Lakshmi: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Embed widget