Priyanka Chopra: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంకా చోప్రా... మహేష్ - రాజమౌళి షూటింగ్ కోసమేనా?
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కన్పించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ SSMB 29. దర్శకతధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం చాలా కాలం నుంచి మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే జక్కన్న సైలెంట్ గానే ఈ మూవీని పూజ కార్యక్రమాలతో షురూ చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
'ఎస్ఎస్ఎంబి 29' కోసమే హైదరాబాద్ కి...
'ఎస్ఎస్ఎంబి 29' సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల చిత్ర బృందం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జక్కన్న మూవీ లాంచ్ ఈవెంట్ ను ప్రైవేట్ గా నిర్వహించి, కనీసం దానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేయలేదు. అంతేకాదు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబుతో పాటు పలువురు విదేశీ నటీనటులు కనిపించబోతున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా సస్పెన్స్ గా ఉన్న విషయం ఏంటంటే హీరోయిన్ ఎవరు? దానికి సమాధానం ప్రియాంక చోప్రా అనే వార్త ఎప్పటి నుంచో విన్పిస్తోంది.
తాజాగా ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్ కి చేరుకోవడంతో, 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ కోసమే హైదరాబాద్ వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె విమానాశ్రయంలో కనిపించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా, ఈ సినిమాపై త్వరలోనే అధికారికంగా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి ప్రియాంక చోప్రా నిజంగానే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిందా ? అనే విషయం అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu - Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2025
ఆరు నెలల పాటు చర్చలు
సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ప్రియాంక చోప్రా దాదాపు ఆరు నెలల టైం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఆలోచనలో పడ్డ ప్రియాంక చోప్రా... ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళితో 6 నెలల పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. ఒకవేళ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తుంది అనే వార్త నిజమైతే గనక 5 ఏళ్ల తర్వాత ఆమె ఇండియన్ సినిమాలో తిరిగి నటించబోతోంది.
ఇదిలా ఉండగా 'ఎస్ఎస్ఎంబి 29' మూవీని రెండు భాగాలుగా, దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. 2026 చివరి వరకు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. 2027, 2029 లలో 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. 'ఎస్ఎస్ఎంబి 29'లో మహేష్ బాబు సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.





















