అన్వేషించండి

Pattudala Trailer: అజిత్ స్క్రీన్ ప్రెజన్స్... హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అనిరుధ్ తాండవం.. టోటల్‌గా మాస్ ర్యాంపేజ్!

Ajith Pattudala Movie Trailer Talk: అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం విడాముయర్చి. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే

Pattudala Trailer Review: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీసెంట్‌గా దుబాయ్ 24 హెచ్ రేస్‌లో స్వయంగా పాల్గొని మూడో స్థానం సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. రేసింగ్, సైట్ సీయింగ్ అంటే ఇష్టపడే అజిత్.. దానికోసం ఎంత వరకైనా వెళతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అలా చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని కూడా ఇటీవల అజిత్ సెలవిచ్చాడు. ఇక రేస్‌లో విజయం అనంతరం మరోసారి అజిత్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కారణం.. ఆయన నటిస్తున్న ‘విడాముయర్చి’ ట్రైలర్. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల కాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

‘‘అజ‌ర్ బైజాన్‌లోని ఒక ఎడారి ప్రాంతంలో అదిరిపోయే చేజింగ్ సీన్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం హాలీవుడ్ రేంజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వడంతో పాటు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. కారు డ్రైవింగ్ చేస్తూ.. సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన అజిత్, ఆ వెంటనే కూల్ లుక్‌‌లో మారిపోయి త్రిషతో కనిపించారు. త్రిషతో జాయ్‌ఫుల్ మూమెంట్స్‌లో కనిపిస్తూనే సడెన్‌గా ఏదో కోల్పోయిన వాడిగా కనిపించి.. ఈ సినిమాలో ఎటువంటి డ్రామా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. ‘నాకు ఈ జనరేషన్ గురించి పెద్దగా తెలియదు.. కానీ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాచ్ పాడయితే రిపేర్ చేయిస్తాం.. టీవీ పాడయితే రిపేర్ చేయిస్తాం.. తీసి పారేయమ్ కదా’ అనే డైలాగ్ వారిద్దరి మధ్య బ్రేకప్‌ని తెలియజేస్తుంది. ఆ వెంటనే యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా అదిరిపోయే ఎంట్రీ. అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు జైలు ఖైదీగా కనిపించి, తను కూడా ఈ సినిమాకు చాలా ముఖ్యమనే విషయాన్ని తెలియజేశారు.

Also Readటీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?

ఇక ఆ తర్వాత రేసీ స్క్రీన్‌ప్లే‌తో ఈ ట్రైలర్ నడిచింది. అజ‌ర్ బైజాన్‌లో నేరాలు జరగడం చాలా తక్కువ అని పోలీస్ ఆఫీసర్ డైలాగ్ చెబుతున్నప్పుడే, అక్కడొక హత్య జరిగినట్లుగా చూపించారు. దానికి కారణమైన వారు వీరే అనేలా రెండు కొత్త పాత్రలను పరిచయం చేశారు. అజిత్-రెజీనా సంభాషణ, ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు.. ఇదొక క్రైమ్ ఇన్విస్టిగేషన్ స్టోరీ అనే విషయాన్ని తెలిపితే.. ఆ క్షణం నుండి ట్రైలర్ ఎండింగ్ వరకు కంటి రెప్ప కూడా వేయనీయకుండా దర్శకుడు ఈ ట్రైలర్‌ని నడిపించారు. ముఖ్యంగా విజువల్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను, ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఓవరాల్‌గా అయితే.. ఈసారి అజిత్ కుమార్‌కు హిట్ పక్కా అనేలా ఈ ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌తో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.

వాస్తవానికి ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక ట్రైలర్‌లో చెప్పిన ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్, నిఖిల్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్‌లోకి విడుదల కానుంది.

Also Read : సైఫ్ అలీ ఖాన్ ఫిట్​నెస్, డైట్ టిప్స్.. యాభై దాటిన ఫిట్​గా ఉండడానికి ఇవే రీజన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget