SSMB29 Update: మహేష్ బాబు రాజమౌళి మూవీ ఓ విజువల్ ట్రీట్ - సిల్వర్ స్క్రీన్‌పై నిజంగా అద్భుతమే...
Mahesh Babu Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై స్టోరీపై పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Prithviraj Sukumaran About SSMB29 Story: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీ గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు తోడు కావడంతో ఇక అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ తెలిసినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'సర్జమీన్' మూవీ ప్రమోషన్లలో భాగంగా 'SSMB29' మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
విజువల్ ట్రీట్
మహేష్ బాబు, రాజమౌళి మూవీ ఓ విజువల్ ట్రీట్ అని... ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ఇది రూపొందుతోందని అన్నారు పృథ్వీరాజ్. 'ఈ మూవీ ఓ విజువల్ వండర్. రాజమౌళి అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సర్ ఎంచుకునే స్టోరీస్ అన్నీ భారీగానే ఉంటాయి. ఈ కథ కూడా అలాంటి కోవకే చెదుతుంది. ప్రతీ ఒక్కరినీ అలరించేలా కథ చెప్పడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. వెండితెరపై ఎవరూ చూడని ఓ అద్భుతాన్ని చూపించబోతున్నారు.' అని పేర్కొన్నారు.
Also Read: 'హరిహర వీరమల్లు' రివ్యూ: ఫస్టాఫ్ సూపర్ హిట్ - సెకండాఫ్? పవన్ సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్!






















