News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chiranjeevi: చిరు బర్త్ డే స్పెషల్ - ‘తేలు’తో ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్, రీమేక్ కాదుగా అంటున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి అనేది ఒక పేరు కాదు. ఒక ఎమోషన్ లాంటిది. అందుకే తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తన తరువాతి సినిమాకు సంబంధించిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి విడుదలయ్యింది. ఈ పోస్టర్ చూస్తుంటే.. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

10.53 గంటలకు రివీల్..
మెగాస్టార్ చిరంజీవి అనేది ఒక పేరు కాదు. ఒక ఎమోషన్ లాంటిది. అందుకే తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన తరువాతి సినిమా అప్డేట్‌ను అందించి చిరు ఫ్యాన్స్‌కు మరింత సంతోషాన్ని పంచాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తన సినిమా ఉంటుందని చిరు.. ఈ పోస్టర్ ద్వారా బయటపెట్టారు. ఈ పోస్టర్‌లో అంతకంటే పెద్దగా వివరాలు ఏమీ లేవు. చీకటిలో రాళ్ల మీద ఉన్న తేలుతో ఈ ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలయ్యింది. ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఆగస్ట్ 22 ఉదయం 10.53 వరకు ఆగాలని ఇందులో రాసుంది. దీంతో అసలు ఈ సినిమా ఏంటి, దీని థీమ్ ఏంటి, దర్శకుడు ఎవరు లాంటి వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సడెన్ సర్‌ప్రైజ్..
చిరంజీవి పుట్టినరోజు అర్థరాత్రి 12 గంటలు కొట్టగానే ఈ ప్రీ కాన్సెప్ట్ వీడియో అనేది ఒక సర్‌ప్రైజ్ లాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఇది చిరు పుట్టినరోజుపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. యూవీ క్రియేషన్స్ అనేది కాన్సెప్ట్‌తో ఉన్న ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి యూవీ క్రియేషన్స్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ గురించి ఎలాంటి వివరాలు తెలియకపోయినా ఫ్యాన్స్ మాత్రం దీనిపై అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. మామూలుగా మెగాస్టార్ సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి ఉంటుంది. కానీ ఈ ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఈసారి చిరు ఏదో ప్రయోగాత్మకమైన చిత్రంలో నటిస్తున్నాడనే అనిపిస్తోంది.

రీమేక్ కాదని నమ్మకం..
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత మెల్లగా ఆయన రీమేక్స్ చూసి ఫ్యాన్స్‌కు సైతం విసుగు వచ్చింది. తాజాగా తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కిన ‘భోళా శంకర్’ కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కనీసం కలెక్షన్స్ సాధించకపోగా.. మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్‌గా నిలిచింది. అందుకే తన తరువాతి సినిమా అయినా రీమేక్ కాకుండా ఉండాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. తాజాగా విడుదలయిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది రీమేక్ అన్నట్టు ఏ మాత్రం అనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: సిరివెన్నెల చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే, దాన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు: 'బెదురులంక 2012' నిర్మాత బెన్నీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Aug 2023 09:23 AM (IST) Tags: Chiranjeevi Birthday UV Creations Bholaa Shankar Chiranjeevi pre concept poster

ఇవి కూడా చూడండి

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279