అన్వేషించండి

Prasanth Varma: హనుమాన్‌ జయంతి: జై హనుమాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ - ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా‌

Jai Hanuman New Poster" జై హనుమాన్‌ ప్రశాంత్‌ వర్మ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. హనుమాన్‌ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసి హాలీవుడ్‌ రేంజ్‌లో మూవీని ప్లాన్‌ చేస్తున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు.

Prasanth Varma Shared Jai Hanuman New Poster: 'హనుమాన్‌' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ (Prasanth Varma). సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు ఇతిహాసాలు జోడించి విజువల్‌ వండర్‌ చూపించాడు. ప్రశాంత్‌ వర్మ పనితీరు చూసి సాధారణ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు.  ఇక హనుమాన్‌కు కొనసాగింపుగా 'జై హనుమాన్‌' (Jai Hanuman)తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసిన ప్రశాంత వర్మ.. 'జై హనుమాన్‌'తో ఎలాంటి వండర్‌ క్రియేట్‌ చేయబోతున్నాడా? అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో  జై హనుమాన్‌ అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు.

సెకండ్‌ పార్ట్‌లో హనుమంతుడి శక్తిని పరిచయం చేసిన ప్రశాంత్‌.. ఇందులో ఎవరికి తెలియని కొత్త పాయింట్‌ రైజ్‌ చేశాడు. ఎండింగ్‌ హనుమంతుడి దగ్గర శ్రీరాముడు తీసుకున్న మాట ఏమిటో సస్పెన్స్‌లో.. అదే పాయింట్‌పై 'జై హనుమాన్‌' రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తవగా.. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా హనుమంతుడు, శ్రీరాముడి చేతిలో చేయి వేసి మాట ఇచ్చిన పోస్టర్‌ను విడుదల చేసి ఆసక్తిని పెంచాడు. ఇప్పుడు హనుమాన్‌ జయంతి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ పోస్టర్‌ చూస్తుంటే ప్రశాంత్‌ వర్మ ఈసారీ భారీ ప్లాన్‌ చేశాడనిపిస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో 'జై హానుమాన్‌' తెరకెక్కించబోతున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి 'జై హనుమాన్‌' ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లోన విడుదల చేయనున్నట్టు అప్పుడే ప్రకటించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

అంతేకాదు అతడి సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే ప్రతి సినిమాను కూడా 3డీ ఫార్మాట్‌లోనే తీసుకురాబోతున్నట్టు ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. ఆకాశంలో డ్రాగన్‌ నిప్పులు కక్కుతూ ఉండగా.. దాని ఎదురుగా హనుమంతుడు నిలబడి కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో సినిమా ఎలా ఉండబోతుందా? హింట్‌ ఇచ్చేశాడు ప్రశాంత్‌ వర్మ. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్‌ మన తెలుగు సినిమాలో రానేలేదని చెప్పాలి. అసలు డ్రాగన్‌లా కాన్పెప్ట్‌ అనేది హాలీవుడ్‌, చైనా సినిమాల్లో తప్పితే తెలుగు సినిమాల్లో ఇంతవరకు కనిపించలేదు. తొలిసారి డ్రాగన్‌లను ప్రశాంత్‌ వర్మ మన తెలుగువారి చూపించబోతున్నాడని అర్థమైపోతుంది. మొత్తానికి హనుమాన్‌ జయంతి సందర్భంగా జై హనుమాన్‌పై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడంటున్నారు మూవీ లవర్స్‌. ఇక మున్ముందు ప్రశాంత్‌ వర్మ ప్రేక్షకులను ఎలా సర్‌ప్రైజ్‌ చేయబోతాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కార్యక్రమాలతో బీజీగా ఉన్నారు. 

Also Read: కమల్‌ హాసన్‌ ఇంట విషాదం - ప్రత్యేకమైన వ్యక్తిని కొల్పోయానంటూ ట్వీట్‌

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget