ఇవాళ.. తెలుగింటి కోకిలమ్మ, నైటింగల్ ఆఫ్ సౌతిండియా ఎస్.జానకి పుట్టిన రోజు.

నేటితో (ఏప్రిల్ 23,2024) ఆమె 86 వసంతాలు పూర్తి చేసుకున్నారు

జానకమ్మగా.. అభిమానంతో పిలుచుకునే ఆమె గుంటూరు జిల్లా రేపల్లెలోని పల్లపట్లగ్రామంలో ఏప్రిల్ 23, 1938లో జన్మించారు.

తన 19వ ఏట 'విదియన్ విలయట్టు' అనే తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 67 ఏళ్లుగా తన గానామృతంతో అలరిస్తున్నారు.

దేశంలోని అత్యుత్తమ నేపధ్య గాయనీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె 13 భారతీయ భాషల్లో, 4 విదేశీ భాషల్లో పాటలు పాడారు.

తన కేరీర్ మొత్తం మీద జానకమ్మ 48000 పైగా పాటలు పాడి అలరించారు.

SPB, S జానకి, ఇళయరాజా ఈ కాంబినేషన్ మొత్తం సౌత్ ఇండస్ట్రీని ఉర్రూతలూగించింది.

తన కెరీర్‌లో జానకమ్మకు 4 జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వరించాయి.

2013లో భారత ప్రభుత్వం ఆమెను 'పద్మభూషణ్' పురస్కారాన్ని ప్రకటించింది. కానీ, దానిని ఆమె తిరస్కరించారు.

తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించారన్న ఆగ్రహంతో 'పద్మభషణ్' ను తిరస్కరించారు జానకమ్మ .

కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. పలు చిత్రాలకు ఆమె సంగీతం కూడా అందించారు.