By: ABP Desam | Updated at : 14 Oct 2021 04:00 PM (IST)
ప్రకాష్ రాజ్ వర్సెస్ ఎన్నికల అధికారి
టాలీవుడ్‌లో "మా" ఎన్నికల సెగలు ఏ మాత్రం తగ్గడం లేదు. తన ప్యానల్ తరపున గెలిచిన సభ్యులందరితో రాజీనామాలు చేయించిన ప్రకాష్ రాజ్ కొత్తగా న్యాయపోరాటం వైపు అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. "మా" పోలింగ్ సందర్భంగా తమ సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని ... దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. మోహన్ బాబు, నరేష్ అనుచితంగా ప్రవర్తించారని అసభ్యంగా తిట్టి, భౌతికంగా దాడులు చేశారని ఆరోపించారు. వారు .. వారి అనుచరులు పోలింగ్ ఏరియాలో మోహరించడానికి పోలింగ్ అధికారి స్థానంలో ఉన్న కృష్ణమోహనే సహకరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
Also Read : బాలకృష్ణతో మోహన్‌బాబు, విష్ణు భేటీ.. అందరినీ కలుపుకుని వెళ్తానన్న "మా" ప్రెసిడెంట్ !
మోహన్ బాబు, నరేష్ దుర్భాషలు ఆడుతున్న దృశ్యాలు, దాడికి వెళ్తున్న కొన్ని దృశ్యాలు మీడియాలో వచ్చాయన్నారు. ఆ రోజున పోలింగ్ సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని.. ప్రముఖులుగా ప్రజలు భావించే వారి బిహేవియర్ ఎలాంటిదో అందరికీ తెలియాల్సి ఉందన్నారు. "మా" సభ్యులు కూడా నిజాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో సీసీ టీవీ కెమెరాల గురించి చెప్పారని .. ఖచ్చితంగా జరిగినదంతా ఆ సీసీ కెమెరాలు రికార్డు చేసి ఉంటాయని ప్రకాష్ రాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ సీసీ టీవీ ఫుటేజీని తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు.
Also Read : నరేష్ తీరుపై టాలీవుడ్ పెద్దలు గుర్రు.. మంచును ముంచుతున్నారా? ‘మా’లో నారదముని ఎవరు?
ఎన్నికలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు తమకు ఉందని లేఖలో ప్రకాష్ రాజ్ తెలిపారు. ఎన్నికల అధికారిగా అన్ని రికార్డులను మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత ఉందన్నారు. అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే వి,యాన్ని చెప్పాయన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకు సీసీ టీవీ ఫుటేజీలు ఇవ్వాలని .. ఒక వేళ లేటయితే డిలీట్ చేయడమో లేకపోతే ట్యాంపర్ చేయడమో చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Seeking justice… my letter to #Maaelections election officer #justasking pic.twitter.com/3P0ex1VOIf
— Prakash Raj (@prakashraaj) October 14, 2021
ప్రకాష్ రాజ్ లేఖపై "మా" ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి రికార్డు భద్రంగానే ఉందన్నారు. సీసీ టీవీ ఫుటేజీ కూడా భద్రంగానే ఉందని.. ప్రకాష్‌రాజ్ కు ఇస్తామని కృష్ణమోహన్ ప్రకటించారు. అందర్నీ కలుపుకుని వెళ్తాను అని మంచు విష్ణు చెబుతున్నారు కానీ.. ప్రకాష్ రాజ్ టీం మాత్రం తాడో పేడో తేల్చుకోవాలన్నట్లుగా అడుగులు వేస్తోంది. న్యాయపోరాటం చేస్తారన్న ప్రచారం కారణంగా మంచు విష్ణు హడావుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన 16వ తేదీన అధికారికంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ లోపు సీసీ ఫుటేజీ కోసం ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారు.
Also Read : మనీ లాండరింగ్ కేసులో నోరా ఫాతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సమన్లు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం