వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి - డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన శ్యామలా దేవి!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు.
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై మరోసారి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. గతంలోనూ చాలాసార్లు ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈమె ఈసారి ప్రభాస్ పెళ్లి ఎప్పుడో కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లి గురించి శ్యామల దేవి గారు ఇచ్చిన అప్డేట్ ఏంటి? డీటెయిల్స్ లోకి వెళితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరని అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు ప్రభాస్. 40 ఏళ్లు దాటినా ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటేయడం ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తిని నింపింది. గత ఆరు, ఏడేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటున్నారే కానీ ప్రభాస్ పెళ్లి జరిగింది లేదు.
కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ షూటింగ్స్ తో బిజీ ఉండటం వల్ల అది జరగలేదు. పెదనాన్న కృష్ణంరాజు చేతుల మీదుగా ప్రభాస్ పెళ్లి జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అనారోగ్యంతో ఆయన కాలం చేశారు. దాంతో ప్రభాస్ కుటుంబ బాధ్యతలు తీసుకొని తన చెల్లెళ్లకు పెళ్లి అయిన తర్వాత తాను చేసుకుంటానని చెప్పినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా శ్యామల దేవి మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వచ్చారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రభాస్ పెళ్లెప్పుడు? అని అడిగారు.
దానికి శ్యామల దేవి బదులిస్తూ.." కృష్ణంరాజు మాతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తుంది. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుంది. అయితే అమ్మాయి ఎవరు? పెళ్లి డేట్ చెప్పను, కానీ త్వరలోనే మా ఇంట్లో శుభకార్యం ఉంటుంది. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఖచ్చితంగా ఓ ఇంటివాడు అవుతాడు" అని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతున్నాయి. శ్యామల దేవి చెప్పినట్లు వచ్చే దసరా లోపు అంటే సరిగ్గా సంవత్సరం తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్నమాట. మరి ఆమె చెప్పినట్లు నిజంగా వచ్చే దసరా లోపు డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అనేది చూడాలి.
మరోవైపు ప్రభాస్ పెళ్లి అనగానే ముందుగా అందరికీ అనుష్క పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి వరుస సినిమాలు చేశారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లికూడా చేసుకుంటున్నారని రకరకాలుగా వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ అవేవీ నిజం కావని, తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రభాస్, అనుష్క పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన 'సలార్' విడుదలకు ముస్తాబవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సలార్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న కల్కి, మారుతి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read : 'లియో' తెలుగు టైటిల్ కోసం సితార నిర్మాత అన్ని లక్షలు ఖర్చు పెట్టారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial