The Raja saab Release Date : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ది రాజా సాబ్' రిలీజ్ రూమర్లకు చెక్... ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
The Raja Saab : ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ రిలీజ్ వాయిదా అంటూ వస్తోన్న రూమర్లపై నిర్మాత స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Prabhas's Spirit Movie Shooting Started With Pooja Ceremony : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని... చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా? అనే రూమర్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, దీనిపై మూవీ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
మూవీ అప్పుడే రిలీజ్
'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందనే రూమర్స్ పూర్తిగా అవాస్తవమని మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 'సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అసత్యం. ప్రస్తుతం 'ది రాజా సాబ్'కు సంబంధించి వీఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. జనవరి 9న వరల్డ్ వైడ్‌గా అన్నీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఐమ్యాక్స్ సహా అన్నీ లార్జర్ ఫార్మాట్స్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టేజియస్ మూవీగా దీన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు.' అని చెప్పారు.
People Media Factory About Rajasaab @peoplemediafcy
— MahiRC 777 (@urGS777) November 4, 2025
World Wide Releasing on 9th January 🔥#RajaSaab pic.twitter.com/evRD4tNACg
Also Read : మూవీ చూస్తే షాక్... హిట్ కాకుంటే వెళ్లిపోతా... ఈవెంట్స్‌లో అతి కొంప ముంచుతుందా?
అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
డిసెంబర్ 25వ తేదీ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని... అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు నిర్మాత. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన టైంకే అంటే వచ్చే ఏడాది జనవరి 9కే మూవీ రిలీజ్ కానున్నందున ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నెల 8 నుంచి...
ఈ నెల 8 నుంచి 'ది రాజా సాబ్' రీ రికార్డింగ్ పనులు మొదలు కానున్నాయి. ఇప్పటి వరకూ హీరో తప్ప అందరి డబ్బింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. రీసెంట్‌గానే కేరళతో పాటు యూరప్‌లో సాంగ్స్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా... ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన లుక్స్, టీజర్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి. ప్రభాస్‌ను ఇదివరకూ ఎన్నడూ చూడని విధంగా వింటేజ్ లుక్‌లో చూపించారు డైరెక్టర్ మారుతి. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ 'స్పిరిట్' మూవీ పూజా కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.






















