Prabhas: ‘గామి’ టీజర్ చూసిన ప్రభాస్ - రియాక్షన్ ఏంటంటే?
Gaami Teaser: విశ్వక్ సేన్ అఘోరగా నటించిన ‘గామి’ మూవీ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యాడు.
Prabhas about Gaami Teaser: యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎక్కువగా ప్రయోగాల వైపుకు ఎప్పుడూ వెళ్లలేదు. కమర్షియల్ సినిమాల్లోనే కామెడీని యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించేవాడు. కానీ మొదటిసారి ఒక అఘోర పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచనున్నాడు. ‘గామి’ అనే సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్.. ప్రేక్షకులలో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా విడుదలయిన ‘గామి’ టీజర్ సైతం ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ‘గామి’ టీజర్‌పై రియాక్ట్ అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టీజర్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
ఎప్పుడూ ముందుంటాడు..
ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తను ఎంత బిజీగా ఉన్నా కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందే ఉంటాడు. తనకు ఏ సినిమాకు సంబంధించిన ఏ అంశం అయినా నచ్చితే.. వెంటనే దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి దానిపై తన అభిప్రాయాన్ని చెప్తుంటాడు. తాజాగా ‘గామి’ టీజర్‌ను కూడా అదే విధంగా షేర్ చేశాడు ఈ పాన్ ఇండియా స్టార్. ‘టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఈ టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు ప్రభాస్. ఈ హీరో పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని తన స్టోరీలో రీ షేర్ చేశాడు విశ్వక్ సేన్. ప్రభాస్ మాత్రమే కాదు.. ఇంకా ఎందరో ప్రేక్షకులు కూడా ‘గామి’ టీజర్‌కు ఫిదా అయిపోయారు.
క్యారెక్టర్స్ ఆఫ్ గామి..
‘క్యారెక్టర్స్ ఆఫ్ గామి’ పేరుతో ఈ టీజర్ విడుదలయ్యింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్.. శంకర్ అనే పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. ‘గామి’తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు విద్యాధర్ కాగిత. ఇది తన మొదటి సినిమానే అయినా.. ఔట్‌పుట్ మాత్రం అద్భుతంగా ఉందంటూ టీజర్ చూసిన ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సినిమా కథ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా టీజర్ కట్ చేశారు మేకర్స్. టీజర్ ప్రారంభంలో ఓ మ్యాప్ కనిపిస్తుంది. తర్వాత ‘‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’’ అనే వాయిస్ వినిపిస్తుంది. శుభలేక సుధాకర్ వాయిస్ ఓవర్‌తో ‘గామి’ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అందులో కీలకంగా నటీనటులు అందరినీ ఈ టీజర్‌లో చూపించారు.
డబ్బింగ్ పూర్తి..
‘గామి’లో విశ్వక్ సేన్‌కు జోడీగా చాందినీ చౌదరి నటించింది. వీరితో పాటు ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్, చాందినీ చౌదరి.. తమ డబ్బింగ్‌ను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ‘గామి’ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. ఇక ఫిబ్రవరీ 29న మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు టీజర్‌లో రివీల్ చేశారు మేకర్స్. ముందుగా మార్చి 8న విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల కావాల్సింది. కానీ ఆ స్థానంలోకి ఇప్పుడు ‘గామి’ వచ్చింది.
Also Read: మేజర్ ముకుంద్‌పై శివకార్తికేయన్ బయోపిక్ - స్పందించిన ఆఫీసర్ భార్య