Fauji Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఫౌజీ' రిలీజ్ డేట్ అదేనా?
Prabhas Fauji Movie: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. 'ఫౌజీ' మూవీ రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Prabhas's Fauji Movie Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'కల్కి 2898 ఏడీ' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆయన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయన 'ది రాజాసాబ్', 'ఫౌజీ' మూవీస్ చేస్తుండగా... ఇటీవలే రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఫౌజీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. 'సీతా రామం' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న 'ఫౌజీ'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ డేట్‌కు సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2 నెలల్లో షూటింగ్ కంప్లీట్?
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించగా... ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే 2 నెలల్లో మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తి చేయాలని టీం భావిస్తోందట. ఈ మేరకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2026, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ షూటింగ్‌లో జాయిన్ కాక ముందే 'ఫౌజీ' షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్ అనుకుంటున్నారట. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం కావాలని హను రాఘవపూడి భావిస్తుండగా... రాబోయే 2 నెలల్లోనే షూటింగ్ మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: శివుని జటల నుంచి ప్రళయం వస్తే అధర్మం అంతమే - ఆసక్తికరంగా 'జటాధర' టీజర్
భారీ బడ్జెట్‌తో...
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 1940ల కాలం నాటి నేపథ్యంలో స్టోరీ సాగనుండగా... ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి కాలానికి తగ్గట్లుగా సెట్స్ వేయాల్సి ఉన్నందున భారీ బడ్జెట్ అవుతుందని... దీనికి మేకర్స్ వెనుకాడడం లేదని సమాచారం.
పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. లవ్, కరేజ్, సాక్రిఫైస్ అన్నీ కలగలిపి వార్ డ్రామాగా మూవీని రూపొందించనున్నట్లు సమాచారం.
ఇక ప్రభాస్ లైనప్ మూవీస్ విషయానికొస్తే... మారుతి డైరెక్షన్‌లో 'ది రాజా సాబ్' ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ జరుగుతుండగా... దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 మూవీస్ ట్రాక్‌లోకి ఎక్కనున్నాయి. రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.





















