అన్వేషించండి

Prabhas Comments on Roohi: సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ భార్య రూహీ మృతి - ప్రభాస్‌ వీడియో వైరల్‌

Prabhas Video:సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ భార్య రూహీ మృతి నేపథ్యంలో హీరో ప్రభాస్‌ ఆమెపై చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. రూహీ మంచిచ స్నేహితురాలు అని, తన చెప్పిన సలహాలు రిలాక్సెషన్‌ ఇచ్చాయన్నాడు.

Prabhas Comments on Roohi: ప్రముఖ టాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ భార్య రూహి మృతి చెందిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ కాలంలో కరోనా కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిందని, ఇటీవల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చెర్పించారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా యోగా శిక్షకురాలైన రూహీకి కూడా సినీ ఇండస్ట్రీతో మంచి పరిచయం ఉంది. పలువురు హీరోహీరోయిన్లకు యోగా శిక్షకురాలిగా వ్యవహరించారు. దీంతో ఆమె మరణవార్త సినీ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. 

దీంతో సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా రూహీ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌ మీడియాలో నివాళులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని, మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రూహీకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రూహి గురించి గతంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రభాస్‌ మాట్లాడుతూ.. రూహీ యోగా ట్రైనర్‌ కావడంతో ఆమె చెప్పే ప్రతి సలహాలను పాటించేవాడినని, షూటింగ్‌ వల్ల అలసటగా అనిపిస్తే ఆమె చెప్పిన యోగా ఆసనాలు ట్రై చేసి రిలాక్స్‌ అయ్యేవాడినన్నాడు. ఆమె తనకు మంచి స్నేహితురాలని, యోగా మన శరీరానికి చాలా ఉపయోగాలను ఇస్తుందన్నాడు.

యోగా చేయడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక రూహీ చెప్పిన సలహాలు, యోగా చిట్కాలు బాహుబలి టైలంలో బాగా యూజ్‌ అయ్యాయంటూ ప్రభాస్‌ మాట్లాడాడు. ఇక రూహీ గురించి ప్రభాస్‌ చేసిన వ్యాఖ్యలు ఆమె మరణం నేపథ్యంలో వైరల్‌గా మారాయి. కాగా రూహీ భర్త, సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్‌ కుమార్‌ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలతో ఆయన స్టార్‌ ఇమేజ్‌ పొందారు.  దాదాపు జక్కన్న తెరకెక్కించిన అన్ని సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఛత్రపతి, యమదొంగ, ఈగ, సై,, బాహుబలి సీక్వెల్స్‌కి రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే రూహీ హీరోయిన్‌ అనుష్క దగ్గర యోగా టీచర్‌గా చాలా కాలం పనిచేశారు. ఇదిలా ఉంటే రూహీ మరణంపై మంచు లక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రూహీ తనతో చేసిన లాస్ట్‌ చాట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. "రూహి నుంచి నాకు వచ్చిన చివరి మెసేజ్‌ ఇది. ప్రతివారం తనని జిమ్‌లో కలుస్తుండేదాన్ని. ఎప్పుడు నిష్కల్మషమైన నవ్వుతో పలకరించేది. జిమ్‌లో మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్‌ చేసేవాళ్లం. దవడలు నొప్పి పుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. కానీ, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని మరోసారి నువ్వు నిరూపించావు రూహీ. ఇంత త్వరగా మమ్మల్ని వదలి వెళ్లిపోయావు. ఎంతో బాధగా ఉంది" అంటూ రాసుకొచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget