Prabhas Spirit Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కి చేదు వార్త - మరింత ఆలస్యంగా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'! కారణం ఏంటంటే..
Prabahs: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో 'స్పిరిట్' మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్స్‌ను ఈఏడాది చివరిలో సెట్స్‌పైకి వస్తుందన్నారు. కానీ ఈ మూవీ మరింత ఆలస్యం అయ్యేలా ఉందట. కారణం
Latest Buzz On Sandeep and Prabhas Spirit:'బాహుబలి' తర్వాత ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. రాజమౌళి 'బాహుబలి' నుంచి మొదలు ప్రభాస్ నటించిన.. నటిస్తున్నా.. నటించబోయే ప్రాజెక్ట్స్ చూస్తే మాత్రం అంతా అవాక్క్ అయిపోవాల్సిందే. అంతగా తన మార్కెట్ పెంచుకున్నాడు ఈ 'డార్లింగ్'. సలార్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడి' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెకుతున్న 'ది రాజసాబ్' ఉంది. అనంతరం 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో(Sandeep Reddy Vanga) జతకట్టబోతున్నాడు. ఇప్పటికే 'స్పిరిట్' (Spirit) పేరుతో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఇది ప్రభాస్ 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే ఈప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. కానీ ప్రభాస్ 'ఆదిపురుష్', సలార్', 'కల్కి' చిత్రాల వల్ల ఈ మూవీ ఆలస్యం అవుతుంది. ఎంతగా అంటే ఈ గ్యాప్‌లోనే సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ మెల్లిన ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాడు. ఇక కల్కి రిలీజ్ అవ్వడమే లేటు స్పిరిట్ మొదలైపోతుందని ఫ్యాన్స్ అంతా ఆశపడ్డారు.
అయితే ఈ తాజా బజ్ ప్రకారం 'స్పిరిట్' మూవీ సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యేలా ఉందట. సందీప్ ఈ ప్రాజెక్ట్ పనులను అంతా సిద్ధం చేసి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడనుకుంటే ఇంకా స్క్రిప్ట్‌ని డెవలప్ చేసే పనిలోనే ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల యానిమల్‌తో బ్లాక్‌బస్టర్ హట్ కొట్టిన సందీప్ రెడ్డి ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్‌పై పనిచేస్తున్నాడట. ఇది పూర్తి అయ్యేసరి మరింత ఆలస్యం అయ్యేలా ఉందట. నిజానికి ఈ సినిమాను 2024 సమ్మర్‌లో తీసుకువస్తామన్నారు. దానిని వాయిదా వేసి ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి తీసుకువస్తానని ఓ ఇంటర్య్వూలో చెప్పాడు డైరెక్టర్.
Also Read: 'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ - ఫస్ట్‌డే అన్ని కోట్లా? ఊహించిన దానికంటే ఎక్కువే రాబట్టిందిగా!
కానీ చూస్తుంటే ఈ ఏడాది కూడా మూవీ షూటింగ్ స్టార్ అవ్వడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికే సందీప్ రెడ్డి వంగాకు ఇంకా 4 నుంచి 5 నెలల టైం పడుతుందట. ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని అంతా సిద్దం అయ్యేసరికి వచ్చే ఏడాది పట్టోచ్చు అంటున్నారు. అంటే స్పిరిట్ సెట్స్‌పైకి వచ్చే 2025లోనే అనేది ఈ తాజా బజ్ సారాంశం. ఇది చూసి ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇది ప్రభాస్ సిల్వర్‌జూబ్లీ మూవీ.. పైగా కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్.. కావడంతో ఈ మూవీని ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడా? అని ఫ్యాన్స్ అంతా ఊహల్లో తెలిపోతున్నారు.
ఈ మూవీ అప్‌డేట్, షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ వార్త నిరాశపరుస్తుందట. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్లు గతంలోనే నిర్మాత అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకువచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి సినిమా చూసి ఉండరు' అంటూ నిర్మాత భూషణ్ కుమార్ అప్‌డేట్ ఇచ్చి మరింత హైప్ పెంచాడు.