Poonam Kaur: కంగనాను కొట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌కి నటి పూనమ్ కౌర్ సపోర్ట్ - ప్రశంసలు కురిపిస్తూ సంచలన పోస్ట్!
Poonam Kaur Shocking Post: కంగనా రనౌత్‌ను కొట్టి కానిస్టేబుల్‌కు నటి పూనమ్ కౌర్ మద్దతు తెలిపారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తు పూనమ్ కౌర్ సంచలన పోస్ట్ చేశారు.
Poonam Kaur Supports CISF Officer Who Slapped Kangana Ranaut: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటన నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ సదరు కానిస్టేబుల్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్(cisf) మహిళ కానిస్టెబుల్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్నికల్లో గెలుపు అనంతరం నేడు జరిగే మోదీ సమావేశానికి కంగనా నిన్న ఢిల్లీ పయనమయ్యారు.
కానిస్టేబుల్‌పై ప్రశంసలు
ఈ క్రమంలో చంఢీగర్‌లో విమానాశ్రయంలో ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అదే సమయంలో చండీగఢ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనాతో వాగ్వాదానికి దిగింది. సెల్ ఫోన్ ట్రేలో పెట్టలేదనే కారణంతో ఆమెతో దురుసుగా ప్రవర్తించింది. ఆమె తీరుపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్టు కంగనా వెల్లడించారు. కంగనాపై దాడి చేసిన ఆమెను అధికారులు సస్పెండ్ చేయడమే కాదు తనపై పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహరంపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సదరు కానిస్టేబుల్‌కు ఆమె మద్దతు తెలపడం చర్చనీయాంశం అయ్యింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేస్తూ.. "చండీగర్ ఎయిర్‌పోర్టులో కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ అధికారి(మహిళ కానిస్టేబుల్)కుల్విందర్ కౌర్ ధైర్యవంతమైన మహిళ" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎంపీ కంగనాను కొట్టిన కానిస్టేబుల్ చర్యను సినీ,రాజకీయ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఇది సహించరానిదంటూ ఆమెను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంటే పూనమ్ కౌర్ ఆమెకు ప్రశంసించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. పూనమ్ కౌర్ ఇలా పోస్ట్ చేయడం వెనక అర్థమేంటని, ఓ నటిగా సాటి నటిపై జరిగిన ఘటనను ఆమె ప్రోత్సహించడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కంగనా బీజేపీ నేత కాగా పూనమ్ కౌర్ కాంగ్రెస్ ఫాలోవర్ అనే విషయం తెలిసిందే. రాజకీయ కక్ష్య నేపథ్యంలో పూనమ్ సదరు కానిస్టేబుల్‌కు సపోర్టు చేసిందంటూ కొందరి నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి.
అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా?
కాగా పూనమ్ కౌర్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ఆమె తరచూ విమర్శలు గుప్పిస్తుంది. ఇటీవల పవన్ గెలుపు అనంతరం కూడా కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసిది. "వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నారనుకుంటా" అంటూ ఊహించని రితీలో పోస్ట్ చేసింది. ఇక ఈ వ్యాఖ్యలు ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియక నెటిజన్లంతా డైలామాలో పడ్డారు. ఇంతకి ఆమె పవన్‌ని ప్రశంసించిందా? వ్యతిరేకించిందా? తెలియక జుట్టు పీక్కరు. ఇప్పుడు తాజాగా కంగనాను కొట్టిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురించి పూనమ్ మరోసారి వార్తల్లో నిలిచారు.