Pookie Title Controversy: బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
Vijay Antony Latest Movie: విజయ్ ఆంటోనీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న 'Pookie' టైటిల్ చూసి తెలుగు ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. కనీసం తెలుగు మీనింగ్ తెలుసుకోకుండా ఎలా పెట్టారని విమర్శలు వస్తున్నాయి.

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ మీద ఇప్పటి వరకు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇప్పుడు వేరే హీరోతో సినిమా చేశారు. ప్రజెంట్ జనరేషన్ ప్రేమ కథతో సినిమా తీశారు. ఆ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ఇవాళ విడుదల చేశారు. అది చూసి తెలుగు జనాలు విస్మయం వ్యక్తం చేశారు.
బూతు బూతు... మీనింగ్ చూడరా!?
ఎవరో ఒకరు సృష్టించకపోతే కొత్త పదాలు ఎలా పుడతాయని ఓ మహానుభావుడు అన్నారు. ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీలోనూ కొత్త పదాలను, వాటి అర్థాలను చేరుస్తూ వస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో భాషలో పదం మరొక భాషలో బూతుగా ధ్వనిస్తుంది. అటువంటి సమయంలో వాటిని పక్కన పెట్టడం మంచిది. ఈ విషయం విజయ్ ఆంటోనీ గుర్తించకపోవడం శోచనీయం.
'మార్గాన్' సినిమాలో తనతో పాటు నటించిన అజయ్ దిషాన్ హీరోగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'Pookie'. అతి జాగ్రత్తగా పలకకపోతే తెలుగులో ఈ పదానికి వేరే మీనింగ్ వస్తుంది. అది కూడా బూతు. విజయ్ ఆంటోనీకి ఎవరూ చెప్పలేదో? లేదంటే తెలిసి ఆ టైటిల్ ఫిక్స్ చేశారో? చూసుకోవాలిగా!
జనరేషన్స్ మారుతున్న కొలదీ పిలుపులు మారుతున్నాయి. మిలీనియల్స్ నుంచి జెన్ జి కిడ్స్ వచ్చాక కొత్త కొత్త పదాలు మరీ ఎక్కువ అయ్యాయి. వాళ్ళు సృష్టించిన పదమే Pookie. ప్రేమతో తమకు ఇష్టమైన వాళ్ళను పిలుచుకోవడానికి క్రియేట్ చేశారు. తెలుగులో అయితే ఈ పదం ఒక పెద్ద బూతు. తెలుగులో కూడా సినిమాకు సేమ్ టైటిల్ ఫిక్స్ చేయడం పట్ల తెలుగు ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయ్. మార్చమని డిమాండ్స్ కూడా వస్తున్నాయి.
Also Read: సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్... కానీ అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!

కిరణ్ అబ్బవరం K Ramp టైటిల్ మీద కూడా ఆ మధ్య విమర్శలు వచ్చాయి. అది పక్కన పెడితే... ఇటీవల తమిళ సినిమా జనాల మీద తెలుగు ప్రేక్షకులు చేసే విమర్శల్లో ముఖ్యమైనది, తమిళ్ టైటిళ్లతో తెలుగులో సినిమాలను విడుదల చేయడం! రజనీకాంత్ 'వేట్టయాన్' నుంచి సూర్య 'కంగువా', ధనుష్ 'రాయన్', అజిత్ 'వలిమై' పట్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ టైటిల్ అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా లేదు. ఆ బూతును భరించమని తెలుగు ప్రేక్షకులపై వదలడం దారుణం. ఛేంజ్ చేస్తారో? లేదో?





















