Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పుల తర్వాత గన్స్‌ను నదిలో పడేసిన నిందితులు - గాలింపుల్లో దొరికింది ఒక్కటే, మరొకటి?
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటి ఎదురుగా జరిగిన కాల్పులు ఘటన కేసులో మరో ముందడుగు పడింది. కాల్పులకు ఉపయోగించిన గన్స్ కోసం జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో పోలీసులు సక్సెస్ అయ్యారు.
Firing Outside Salman Khan House Case: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా ఇప్పటికీ ముంబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు జరిపిన తర్వాత ముంబాయ్ నుండి పారిపోవాలి అనుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా వారు ఉపయోగించిన గన్స్‌ను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఒక్కటే దొరికింది..
సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా జరిగిన కాల్పుల కేసును విచారించడానికి ముంబాయ్ పోలీసులు ఒక 12 మంది టీమ్‌గా ఏర్పడ్డారు. వారంతా కలిసి తాజాగా కాల్పులకు ఉపయోగించిన గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూరత్‌లోని టాపీ నదిలో ఈ గన్ దొరికినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సల్మాన్ ఇంటి ఎదురుగా కాల్పులు జరిపిన తర్వాత నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21).. ఈ నదిలోనే తమ గన్స్‌ను పడేసినట్టుగా స్టేట్‌మెంట్‌లో తెలిపారు. దీంతో అప్పటినుండి ఈ స్పెషల్ పోలీస్ టీమ్.. గన్స్‌ను వెతకడం మొదలుపెట్టింది. రెండు గన్స్‌లో ఒక గన్ దొరకగా.. ఇంకొక తుపాకీ కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
నదిలో పడేశారు..
సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ అయిన దయా నాయక్ సైతం ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం సూరత్ బయల్దేరారు. సూరత్‌లోని లోకల్ డైవర్స్, మత్యకారులు.. పోలీసులకు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సాయం చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా కాల్పులు జరిగిన విక్కీ, సాగర్‌లను భుజ్‌లోని ఒక గుడి ముందు అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబాయ్‌లోని బాండ్రా ఏరియాలో ఉండే గ్యాలక్సీ అపార్ట్‌మెంట్ ముందు వీరు రెక్కీ నిర్వహించి మరీ కాల్పులు జరిపినట్టు విచారణలో తేలింది. వారిద్దరు రెండు గన్స్‌తో ఈ దాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత భుజ్‌కు పారిపోతున్న సమయంలో టాపీ నదిలో ఈ తుపాకీలను పడేసినట్టు వారు తెలిపారు.
ట్రైన్ ఎక్కి పారిపోయారు..
సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా దొరికిన సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం.. విక్కీ, పాల్ ఇద్దరి చేతుల్లో గన్స్ ఉన్నాయి. కానీ పాల్ మాత్రమే తన గన్‌ను ఉపయోగించి కాల్పులు జరిపాడు. ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగారు. అప్పటికే భుజ్‌కు వెళ్లే ట్రైన్ ఎక్కి నిందితులు పారిపోయారు. పోలీసులు కూడా భుజ్‌కు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలోని వారు గన్స్‌ను నదిలోకి పడేసినట్టు తెలుస్తోంది. ఇక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్.. సల్మాన్ ఖాన్‌పై ఈ దాడి చేయించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి.
Also Read: 'జెర్సీ' 2 ఎప్పుడు? ఏమో.. ఎవరితో చేస్తారో చేసుకోండి! నాని షాకింగ్ కామెంట్స్ - అంత మాట అనేశాడేంటి!