News
News
వీడియోలు ఆటలు
X

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ నేపథ్యంలో పోలీసులకు కీలకమైన క్లూ దొరికింది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

FOLLOW US: 
Share:

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె వెంటనే తెయనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు కనిపించడంలేదని వాటి విలువ సుమారు 3.60 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆభరణాలు ఉన్న లాకర్‌ను 2022 ఏప్రిల్‌లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఐశ్వర్య. అందుకు సంబంధించిన లాకర్ కీస్ తన అపార్ట్మెంట్ లోనే ఉండేవని, దాని గురించి తన ఇంట్లో పనిచేసే కొంతమంది వ్యక్తులకు తెలుసని తెలిపింది. అయితే తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొంది ఐశ్వర్య. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇంటి పనిమనిషి ఈశ్వరి, ఆమె భర్తను విచారించారు. ఇటీవల వారి అకౌంట్లలో భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ జంటను పోలీస్ స్టేషన్ లో విచారణ కోసం పిలిపించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆభరణాలను చోరీ చేసిన ఈశ్వరి.. వాటిని నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. 

ప్రస్తుతం ఐశ్వర్య ‘లాల్ సలాం’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ లో ఆమె బిజీగా ఉంటుంది. లొకేషన్స్ కోసం తమిళనాడులో పలు ప్రాంతాలలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించింది ఐశ్యర్య. తన వద్ద ఉన్న బంగారు, వజ్రాభరణాలను 2022 ఏప్రిల్‌లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఐశ్వర్య. అయితే ఆ లాకర్ కీస్ మాత్రం తన అపార్ట్మెంట్ లోనే ఉండేవని ఆ విషయం తన ఇంట్లో పనిచేసే కొంతమందికి తెలుసని చెప్పింది. ఫిబ్రవరి 18న లాకర్ తెరచి చూస్తే తన ఆభరణాల్లో కొన్ని మిస్ అయినట్టు గుర్తించింది. ఇంటి పని వారిమీదే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులకు పని మరింత సులువైంది. పని మనిషి ఈశ్వరి ఆమె భర్తను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 60 సవరాల నగలుతో పాటు డైమండ్స్ సహా ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

ప్రస్తుతం ఐశ్వర్య ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రజనీ కాంత్ కూడా ఓ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 8న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లగా, ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ అలాగే రాజకీయాల నేపథ్యంలో మూవీ కథ ఉండబోతోందని సమాచారం. 

Also Read 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?

Published at : 21 Mar 2023 07:07 PM (IST) Tags: Rajinikanth Aishwaryaa Aishwaryaa Rajinikanth Lal Salam Movie

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు