అన్వేషించండి

Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి

Peddi Vs Pushpa Story Explained: ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన సినిమా 'పుష్ప'. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ నేపథ్యంలో తీసిన సినిమా 'పెద్ది'. రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటే. అదేమిటో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రామ్ చరణ్ 'పెద్ది', అల్లు అర్జున్ 'పుష్ప' కథల్లో పోలిక.
  • పుష్పరాజ్ ఇంటిపేరు లేక, తన గుర్తింపు కోసం పోరాడాడు.
  • పెద్ది, ప్రభుత్వ గుర్తింపు లేని తన ఊరి కోసం యుద్ధం చేశాడు.
  • గురు శిష్యులు సుకుమార్, బుచ్చిబాబు 'గుర్తింపు' కథలు సృష్టించారు.

రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు ముందు నుంచి, ఈ సినిమా అల్లు అర్జున్ 'పుష్ప 2' రికార్డులను బద్దలు కొడుతుందా? అని డిబేట్ పెట్టారు కొందరు. 'పుష్ప 2'కు ఒక అడ్వాంటేజ్ ఉంది. నార్త్ ఇండియాలో 'పుష్ప' భారీ హిట్ కావడంతో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక్కడ 'పెద్ది' విడుదలకు ముందు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ అయ్యింది. కలెక్షన్స్ కంపారిజన్ పక్కన పెడితే... రెండు కథల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటో తెలుసుకోండి.

పేరు కోసం... చేశారు జీవిత యుద్ధం
పుష్ప, పెద్ది... రెండు క్యారెక్టర్లు వేర్వేరు. రెండిటి కథలు వేర్వేరు. 'పుష్ప'లో హీరో ఎర్రచందనం స్మగ్లర్. కానీ, ఇక్కడ 'పెద్ది'లో హీరో క్రికెటర్. క్రికెట్ నుంచి కుస్తీ, ఆ తర్వాత కుస్తీ నుంచి రన్నింగ్ ట్రాక్ మీదకు వస్తాడు. మూడు ఆటల్లో తిరుగులేని ఆటగాడిగా కనిపిస్తాడు. అయితే... పుష్ప, పెద్ది - ఇద్దరు చేసిన యుద్ధం ఒక్కదాని కోసమే తెలుసా?

పేరు... పేరు... పేరు... పేరు కోసమే జీవిత యుద్ధం చేశారు పుష్ప, పెద్ది. అల్లు అర్జున్ 'పుష్ప' కథ గుర్తుందా? అందులో కీలకమైన అంశం ఒకటి గుర్తుందా? హీరో పుష్పరాజ్‌కు ఇంటి పేరు ఉండదు. పుష్పరాజ్ తండ్రికి తన తల్లితో కంటే ముందు మరొక మహిళతో వివాహం అవుతుంది. ఆవిడ సంతానం పుష్పరాజ్‌ను, తల్లిని తమ కుటుంబంగా గుర్తించరు. ఇంటి పేరు లేదని పుష్ప ఎంతో మనోవేదన పడతాడు. చివరకు వచ్చిన తర్వాత ఆనందభాష్పాలు వస్తాయి. కట్ చేస్తే... పెద్ది కూడా పేరు కోసమే పోరాటం చేశాడు. అతనితో పాటు అతని ఊరి పేరు కోసం యుద్ధం చేశారు.

Also ReadPeddi Review Rating In Telugu - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?

'పెద్ది' కథకు వస్తే... విజయనగరానికి దగ్గరలోని ఓ కొండ కింద ఊరు హీరోది. ఆ ఊరి జనాలు ఎవ్వరికీ ఓటు హక్కు లేదు. అసలు అటువంటి ఊరు ఒకటి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో లేదు. అందుకే ఆ ఊరికి రోడ్డు, రైలు సదుపాయలు లేవు. తమ ఊరికి గుర్తింపుతో పాటు రైల్వే స్టేషన్ కోసం పెద్ది ఏం చేశాడు? చివరకు ఆ పేరును ఎలా సంపాదించాడు? అనేది కథ.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

'పుష్ప', 'పెద్ది'... రెండు కథల్లో కోర్ పాయింట్ - గుర్తింపు. ఒకరు ఇంటి పేరు, గుర్తింపు కోసం పోరాటం చేస్తే... మరొకరు ఊరి పేరు, ఊరిలో జనాలకు గుర్తింపు కోసం లైఫ్ రిస్క్ చేసి మరీ పోరాటం చేశారు. అన్నట్టు... 'పుష్ప'ను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తీస్తే, 'పెద్ది'ని ఆయన శిష్యుడు బుచ్చిబాబు తీశారు. గురుశిష్యులు ఐడెంటిటీ అనేది తీసుకుని వేర్వేరు కథలు రాయడం విశేషం.

Also ReadPeddi Premiere Collections - రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget