అన్వేషించండి

Peddi Premiere Collections: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత

Peddi Collections Day 1: వరల్డ్ వైడ్ రిలీజ్ కంటే ముందు 'పెద్ది' రికార్డు క్రియేట్ చేసింది. ప్రీమియర్ కలెక్షన్లతో 'ధురంధర్ 2 ది రివేంజ్', 'ఓజీ' సినిమాల సరసన చేరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చరణ్ నటన, ప్రచారంతో 'పెద్ది' ప్రీమియర్లకు అద్భుత స్పందన లభించింది.
  • సినిమా దేశవ్యాప్తంగా ప్రీమియర్లతో 20.12 కోట్లు వసూలు చేసింది.
  • ఏపీ ₹10.33 కోట్లు, నైజాం ₹6.46 కోట్లతో ప్రధాన వాటా.
  • 'ఓజీ' తర్వాత 20 కోట్లు దాటిన మూడో భారతీయ చిత్రం.

Ram Charan Peddi Paid Premiere Collections: 'పెద్ది' రివ్యూలలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ మంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. విడుదలకు ముందు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మాట్లాడారు. 'పెద్ది' టీజర్, పాటలు కూడా సినిమాపై ప్రేక్షకులలో, ముఖ్యంగా అభిమానులలో అంచనాలు పెంచాయి. దాంతో ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ బాగా వచ్చాయి. 

ఇండియాలో పెద్ది ప్రీమియర్స్ @ 20 కోట్లు
Peddi All India Premieres Collection: ట్రేడ్ పోర్టల్స్ లెక్కల ప్రకారం... జూన్ 3వ తేదీ రాత్రి 'పెద్ది' సినిమాకు ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ద్వారా రూ. 20.12 కోట్లు వచ్చాయి. ఏపీలో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. టికెట్ రేట్స్ హైక్ విషయంలో అక్కడ ప్రభుత్వం నుంచి జీవో ముందుగా రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఎర్లీగా స్టార్ట్ చేయడంతో జనాలు థియేటర్లకు బాగా వచ్చారు

'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో సగం అమౌంట్ ఏపీ నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదర్శించిన ప్రీమియర్స్ ద్వారా 10.33 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ప్రీమియర్స్ పడటానికి కొన్ని గంటల ముందు మాత్రమే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయినా సరే సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించింది. నైజాం నుంచి ప్రీమియర్స్ ద్వారా 6.46 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత మూడు కోట్లు... 'పెద్ది'కి ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ వసూళ్లు కర్ణాటక నుంచి వచ్చాయి. టోటల్ ఆల్ ఇండియా ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ 20.12 కోట్లు. 

Also Read: Upasana At Peddi Premiere - 'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య

'ఓజీ', 'ధురంధర్ 2' తర్వాత!
ఇప్పటి వరకు ఇండియాలో కేవలం ప్రీమియర్స్ ద్వారా 20 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు రెండు అంటే రెండు మాత్రమే. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఉంది. ప్రీమియర్స్ ద్వారా హయ్యస్ట్ కలెక్షన్స్... 20 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి సినిమాగా 'దే కాల్ హిమ్ ఓజీ' రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత స్థానం రణవీర్ సింగ్ 'ధురంధర్ 2: ది రివేంజ్'ది. ఆ రెండు సినిమాల తర్వాత ప్రీమియర్స్ కలెక్షన్స్ గ్రాస్ 20 కోట్లు దాటిన సినిమా 'పెద్ది'.

Also ReadPeddi Review Rating In Telugu - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?

అమెరికాలోనూ 'పెద్ది' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్టులో 'పెద్ది' ఆల్రెడీ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. క్రిటిక్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. ఓపెనింగ్ డే కూడా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సినిమాకు మంచి టాక్ లభించింది.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaaram : మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Charan : నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget