Peddi Movie : ఫ్యూచర్ కర్ణాటక సీఎం ఉపేంద్ర - శివరాజ్ కుమార్ రియాక్షన్
Shiva Rajkumar Reaction : తమిళనాడు సీఎంగా విజయ్ కావడం చూశామని... ఫ్యూచర్‌లో కర్ణాటకలో నటుడు ఉపేంద్రకు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అంటూ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రశ్నించారు.

Kanna Actor Shiva Rajkumar About His Role In Peddi Movie : పెద్దిలో తన రోల్ చాలా స్పెషల్ అని... డైరెక్టర్ బుచ్చిబాబు వేరొకరిని కాకుండా తనను మాత్రమే ఈ పాత్ర కోసం సంప్రదించారని చెప్పారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. ఈ మూవీలో ఆయన గౌర్నాయుడు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ విశేషాలతో పాటు తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతల స్వీకరణ, ఫ్యూచర్‌లో నటుడు ఉపేంద్ర కర్ణాటక సీఎం కావడం వంటి అంశాలపై రియాక్ట్ అయ్యారు.
ఉపేంద్ర సీఎం అయితే?
యాక్టర్స్ ముఖానికి మాత్రమే రంగులు వేసుకుంటారని... రియల్ లైఫ్‌లో రంగులు మార్చరని అన్నారు శివరాజ్ కుమార్. 'ప్రజలకు మా ఫ్యామిలీ ఎంతో సేవ చేస్తోంది. అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లాలని ఇంట్రెస్ట్ లేదు. నిజంగా నటుడు ఉపేంద్ర పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటే అది మంచి విషయమే. రీసెంట్‌గా విజయ్ తమిళనాడు సీఎం కావడం చూశాం. ప్రజలంతా ఆయనకు ఎంత సపోర్ట్ ఇచ్చారో చూశాం.
అలా కర్ణాటకలో ఉపేంద్ర సీఎం అయితే ఎందుకు సపోర్ట్ ఇవ్వకూడదు? మేం సినిమాల కోసమే ముఖానికి రంగులు వేసుకుంటాం. ప్రజల విషయంలో చాలా స్పష్టంగా ఉంటాం. మూవీస్ కోసం మేకప్ వేసుకున్నప్పటికీ ప్రజలకు సేవ చేసే విషయంలో ఎలాంటి రంగులు లేకుండా చేస్తాం.' అని చెప్పారు.
Also Read : పెద్ది టికెట్ ధరలు పెంపు - తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
'విజయ్ సీఎం కావాలనుకున్నా'
తనను ఇప్పటివరకూ ఎవరూ నిందించలేరని... ఎంత చేశానో అందరికీ తెలుసని అన్నారు శివరాజ్ కుమార్. 'నేను ఏం చేశానో వారు వచ్చి చూడొచ్చు. చేసే ప్రతీ మంచి పేపర్లో రాకపోవచ్చు. కానీ ప్రజలకు తెలుసు. వాళ్ల హృదయమే మాట్లాడుతుంది. విజయ్ పాలిటిక్స్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషించా. ఆయన స్పీచెస్ ఎంతో ఆకట్టుకుంటూ నా మనసుకు హత్తుకున్నాయి. అతను వస్తే మార్పు వస్తుందని అనుకున్నా.
సీఎంగా గెలిస్తే బాగుండు అని చాలాసార్లు అనుకున్నా. కోరుకున్నట్లుగానే ఆయన అఖండ విజయం సాధించాడు. కొంతమంది ఏ పనిలోనైనా నిజాయతీగా ఉంటారు. భగవంతుడు వాళ్లను కచ్చితంగా గుర్తిస్తాడు.' అని చెప్పారు. అభిమానులు నా నుంచి స్ఫూర్తి పొంది కొందరికైనా సాయం చేస్తే చాలని అన్నారు.
Also Read : పెద్ది టికెట్ ధరలు పెంపు - తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
పెద్ది విషయానికొస్తే... జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ వేసుకోవడం సహా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















