Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ థాంక్స్ చెప్పారు - ఎవరికి, ఎందుకో తెలుసా?
Arjun Das: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా యాక్టర్‌కు థాంక్స్ చెప్పారు. 'హరిహర వీరమల్లు' మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan Thanks To Arjun Das: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇక స్క్రీన్‌పై పవర్ ఫుల్‌గా కనిపిస్తే ఆ గూస్ బంప్స్ మాటల్లో వర్ణించలేం. ఆయన ప్రత్యేకంగా ఒకరికి థాంక్స్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆ నటుడిపై ప్రశంసలు కురిపించారు.
అరుదుగా సాయం అడుగుతుంటా
'తాను అరుదుగా సాయం అడుగుతానని... నేను అడిగింది నువ్వు చేశావ్' అంటూ నటుడు అర్జున్ దాస్‌కు పవన్ థాంక్స్ చెప్పారు. 'డియర్ బ్రదర్ అర్జున్ దాస్... నీకు నేను కృతజ్ఞుడిని. నీ వాయిస్‌లో మ్యాజిక్, మెలోడి ఉన్నాయి.' అంటూ ప్రశంసించారు. పవన్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌కు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. గురువారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ ఓ పోస్ట్ పెట్టగా దానికి పవన్ బదులిచ్చారు.
Dear Brother @iam_arjundas , I am grateful to you.
— Pawan Kalyan (@PawanKalyan) July 3, 2025
Very rarely , I will ask for a favor..
Thank-you for considering mine.Your Voice has magic and melody. 🙏 https://t.co/0bQnBmeagG
Also Read: 'తమ్ముడు' ట్విట్టర్ రివ్యూ: నితిన్ మరో హిట్ కొట్టడం కష్టమేనా? ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
ఒక్క డైలాగ్... చాలా పవర్ ఫుల్
'హరిహర వీరమల్లు' ట్రైలర్ ప్రారంభంలో వచ్చే ఒకే ఒక్క డైలాగ్‌తో సినిమాలో పవర్ స్టార్ పవన్ ఎలా ఉండబోతున్నారో చెప్పేసింది. 'హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం... ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం... ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.' అంటూ తమిళ యాక్టర్ అర్జున్ దాస్ చెప్పే డైలాగ్ వేరే లెవల్. ఆయన వాయిస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గంభీరంగా ఓ పవర్ ఫుల్ వార్‌కు తగిన విధంగా హైప్ రెండింతలయ్యేలా వాయిస్ ఓవర్ ఉందని పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
లోకేశ్ కనగరాజ్ తీసిన సినిమాలతో తమిళ యాక్టర్ అర్జున్ దాస్ పాపులర్ అయ్యారు. తెలుగులో 'బుట్ట బొమ్మ' అనే మూవీని చేశారు. పవన్ హీరోగా వస్తోన్న మరో అవెయిటెడ్ మూవీ 'ఓజీ'. ఈ సినిమాలో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్‌తో విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌కు సైతం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ షూటింగ్ టైంలో ఆయన గొంతు విని పవన్ కల్యాణ్ స్వయంగా అడగడంతో 'హరిహర' వాయిస్ ఇచ్చారు అర్జున్ దాస్. 'పవన్ గారు వాయిస్ ఇవ్వమని అడిగితే వేరే ప్రశ్నలు అడగకుండా మీరు ఎస్ అనే చెబుతారు. ఇది మీ కోసమే పవన్ సార్. హరిహర వీరమల్లు టీం అందరికీ ఆల్ ది బెస్ట్.' అంటూ పోస్ట్ చేయగా... దీనికి పవన్ థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.






















