అన్వేషించండి

Pawan Kalyan OG Release Date: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో ఓజీ కొత్త పోస్టర్

Pawan Kalyan new poster from OG movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

నో డౌట్... ఈ ఏడాది సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. సెప్టెంబర్ 2న జనసేనాని బర్త్ డే! ఆ సమయానికి 'ఓజీ' ఫీవర్ ఓ రేంజ్‌కు చేరుకోనుంది. ఇక విడుదల తేదీతో పాటు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పవచ్చు. కిర్రాక్ లుక్‌లో హీరోని చూపించిన తీరు బావుంది.

సెప్టెంబర్ 27న 'ఓజీ' విడుదల
OG Movie Release Date: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'రన్ రాజా రన్', ప్రభాస్ 'సాహో' సినిమాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ' (అంటే... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. డీవీవీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని కొన్ని రోజులుగా వినబడుతోంది. ఈ రోజు అధికారికంగా విడుదల తేదీ వివరాల్ని వెల్లడించారు. 

చేతిలో జనసేన గుర్తు గాజు గ్లాసు చూశారా?
ఓజీ రిలీజ్ డేట్ పోస్టర్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. తమ ఫేవరేట్ హీరో స్టైలిష్ లుక్ నచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అభిమానుల్ని ఆకర్షించిన మరొక అంశం ఏమిటంటే... పవన్ చేతిలో గాజు గ్లాసు. అది జనసేన పార్టీ గుర్తు కావడం డిస్కషన్ టాపిక్ అయ్యింది. పవన్ ఇంతకు ముందు నటించిన కొన్ని సినిమాల్లోనూ ఆయన చేతిలో గాజు గ్లాసు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి మద్దతుగా జ్యోతిక 'అమ్మ ఒడి'... టీడీపీని టార్గెట్ చేశారా?

Pawan Kalyan OG Release Date: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో ఓజీ కొత్త పోస్టర్

పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్
'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా తమిళ కథానాయిక ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా చేశారామె. శర్వానంద్ 'శ్రీకారం' కూడా! శివకార్తికేయన్ 'డాక్టర్' (తెలుగులో 'వరుణ్ డాక్టర్'గా విడుదలైంది), 'డాన్' సినిమాలు ఆమెకు భారీ విజయాలు అందించాయి. ఇంకా 'ఓజీ'లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, వెంకట్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read: జగన్ నవ్వారు, అంతే! సీరియస్‌గా తీసుకోలేదు - 'యాత్ర 2' దర్శకుడు మహి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఆల్రెడీ విడుదలైన 'ఓజీ' వీడియో గ్లింప్స్ 'హంగ్రీ చీతా'కు తమన్ ఎక్స్ట్రాడినరీ ట్యూన్ ఇచ్చారు. అది సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ఒక పాట పాడించే ఆలోచనలో ఉన్నామని, అందుకు తగ్గ అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమా కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. 

Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్‌ రామ్ చరణ్ చేస్తారా? భర్త గురించి ఉపాసన ఏమన్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు మంచి నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు మంచి నెంబర్స్
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget