OG2 Update : OG సీక్వెల్ సర్‌ప్రైజ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్... సుభాష్ చంద్రబోస్‌తో వారియర్
OG Sequel : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా OG సీక్వెల్ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Director Sujeeth Update On OG Sequel : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'OG 2' అప్డేట్‌ను డైరెక్టర్ సుజీత్ ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
గతేడాది గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన OG పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. సగటు అభిమాని సిల్వర్ స్క్రీన్‌పై ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో అలానే చూపించారు డైరెక్టర్ సుజీత్. ఇప్పుడు సీక్వెల్‌ను అంతకు పదింతల మాస్ లుక్, కొత్త యుద్ధ విద్యలు, యాక్షన్‌తో రూపొందించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో జపనీస్ స్వార్డ్ ఖటానా వెరీ ఫేమస్. యాక్షన్ సీక్వెన్స్ కూడా అంతే అద్భుతం.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ సుజీత్‌తో పవర్ స్టార్ OG సీక్వెల్ స్టోరీ డిస్కస్ చేసిన వీడియోను రిలీజ్ చేస్తూనే... బ్యాగ్రౌండ్‌లో స్టోరీ ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. ముంబై వదిలి వెళ్లిన గంభీర ఏం చేశాడు? అనేదే ప్రధానాంశంగా... సుభాష్ చంద్రబోస్ వారియర్‌గా చూపించబోతున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఆయన రోల్‌కు సంబంధించి యాక్షన్ సీన్స్, యానిమేషన్ విజువల్స్ అదిరిపోయాయి. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) బ్యానర్‌పై సీక్వెల్ రూపొందించనున్నారు.
From the #OGUniverse
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
To the #OG…
ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️
Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
బాక్సాఫీస్ వద్ద OG బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజీత్ హింట్ ఇచ్చారు. దీంతో పాటే ప్రీక్వెల్ కూడా ఉండొచ్చనే ప్రచారమూ సాగింది. OG సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలుమార్లు స్టోరీ డిస్కషన్స్‌తో సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు డైరెక్టర్. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే... మరోవైపు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా, పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
OG సీక్వెల్... గంభీరా స్టోరీ!
ముంబైలో మాఫియా ప్రపంచాన్ని వణికించిన ఓజాస్ గంభీర కొన్నేళ్లు ముంబైను వదిలి వెళ్లి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో గంభీర ఎక్కడకు వెళ్లాడు? ఆ బ్యాగ్రౌండ్ స్టోరీ ఏంటి? అనేదే OG2లో చూపించనున్నట్లు తెలుస్తోంది. మరి స్టోరీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇది సీక్వెలా ప్రీక్వెలా అనేది చెప్పలేదు. ఆడియన్స్‌కు చూపించని ఓ గంభీర స్టోరీని చూపించబోతున్నట్లు మాత్రం హింట్స్ ఇచ్చారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
OGలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
ట్రెండింగ్ వార్తలు






















