Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Irumudi Box Office Collection : మాస్ మహారాజ రవితేజ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి సినిమా రికార్డు బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

Ravi Teja's Irumudi World Wide Box Office Collections : మాస్ మహారాజ రవితేజ రీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సాధించింది.
200 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో...
ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇరుముడి' ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు ఇండియావ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. 'ఎవ్రీ జనరేషన్... ఎవ్రీ థియేటర్... ఒకే సెలబ్రేషన్' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ మనెమ్మను అయ్యప్ప స్వామిగా చూపించారు.
పులిపై మనెమ్మ ఉండగా... ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్న పోస్టర్ ట్రెండ్ అవుతోంది. రవితేజ కెరీర్‌లోనే ఇరుముడి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత ఆయన సూపర్ సక్సెస్‌తో కమ్ బ్యాక్ ఇచ్చారు. మాస్ కంటెంట్ కథలకు డిఫరెంట్‌గా... డివోషన్‌తో పాటు ఎమోషనల్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశాలతో వచ్చిన ఇరుముడి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటోంది.
చిరు మూవీ రికార్డ్ బ్రేక్
తాజాగా, ఇరుముడి మెగాస్టార్ చిరంజీవి మూవీ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ సినిమాస్ రికార్డులను అధిగమిస్తోంది. తెలంగాణలో రూ. 48 కోట్లతో హయ్యెస్ట్ షేర్ సాధించిన మూవీగా నిలిచింది. ఇదివరకూ ఈ రికార్డు మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' పేరిట రూ.47.55 కోట్లతో ఉండగా... ఇరుముడి అధిగమించింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కన్ఫర్మ్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా... రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. రవితేజ కుమార్తెగా చిన్నారి నక్షత్ర నటించారు. అలాగే, అజయ్ ఘోష్, సాయి కుమార్, స్వాసిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రశాంతమైన ఊరిలో మధ్య తరగతి కుటుంబం, ఆ ఫ్యామిలీకి వచ్చిన అనుకోని ఆపద... డివోషన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ను స్టోరీలో చూపించారు.
Also Read : Pawan Kalyan : మా కల్యాణ్ బాబును చూస్తుంటే గర్వంగా ఉంది - పవర్ స్టార్‌కు మెగాస్టార్ చిరు బర్త్ డే విషెష్
Before You Go
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
ట్రెండింగ్ వార్తలు






















