Hari Hara Veera Mallu: తెలంగాణలో 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షోలకు అనుమతి - టికెట్ ధరలు ఎంతో తెలుసా?
HHVM Ticket Rates: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ పెయిడ్ ప్రీమియర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది.

HHVM Ticket Rates Hike In Telangana: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఒకరోజు ముందుగానే సినిమా ప్రదర్శితం కానుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే, టికెట్ రేట్ల పెంపునకు కూడా ఓకే చెప్పింది.
టికెట్ ధరలు ఇవే...
ఈ నెల 24న మూవీ రిలీజ్ కానుండగా... 23న రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అదనం) ఉండనుంది. అలాగే, ఈ నెల 24 నుంచి 27 వరకూ ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీ ప్లెక్స్‌ల్లో అయితే రూ.200 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 2 వరకూ ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూనే... మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీ+), సింగిల్ స్క్రీన్లలో రూ.106 (జీఎస్టీ +) వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది.
Also Read: మహేష్ బాబు న్యూ లుక్ అదుర్స్ - బెస్ట్ ఫోటో మూమెంట్ విత్ సూపర్ స్టార్
ఏపీలో టికెట్ ధరలు ఇలా...
అటు, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ ధరలు పెంపు సహా పెయిడ్ ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.100 (లోయర్ క్లాస్), రూ.150 (అప్పర్ క్లాస్) పెంచుకునేందుకు అనుమతిచ్చింది. మల్టీ ప్లెక్స్‌లో రూ.200 వరకూ పెంచుకునేందుకు వీలు కల్పించింది.
దీంతో పాటే పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న రాత్రి ఎంపిక చేసిన కేంద్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వేసుకునేలా వీలు కల్పించింది. టికెట్ ధర రూ.600 కాగా... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని పోలీస్ శాఖతో పాటు అధికారులను ఆదేశించింది.
ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్లతో పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాత ఎఎం రత్నం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరు ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి.
ఫ్యాన్స్ హడావుడి
ఈ నెల 24న మూవీ రిలీజ్ కానుండగా... అటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్లలో భాగంగా మూవీ టీం ఇస్తున్న లీక్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిని పెంచేస్తున్నాయి. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా... బాబీ డియోల్, నోరా ఫతేహి, జిషు షేన్ గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్ఫణలో ఎ దయాకరరావు నిర్మించగా... క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.






















