By: ABP Desam | Updated at : 22 Apr 2023 01:25 PM (IST)
'పత్తు తల' సినిమాలో శింబు, ఇతర నటీనటులు (Photo Credit: prime video IN/Instagram)
తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో ఒబేలి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పత్తు తల’. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ గదా, జానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివరాకుమార్ కన్నడ చిత్రం ‘మఫ్తీ’కి రీమేక్ గా తెరకెక్కింది. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదల అయ్యింది. గౌతమ్ కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా భవానీ శంకర్, అను సితార సహా పలువురు ఇందులో నటించారు. విడుదలైన తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు ఏజీఆర్‌గా నటించారు.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఓటీటీ దిగ్గజం బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు వెల్లడించింది. థియేటర్లలో సినిమా చూడలేని శింబు అభిమానులు, సినీ లవర్స్ ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
సుమారు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేశారు. విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. ఈ చిత్రం శింబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తమిళంలో 18 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 2 కోట్లకు బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే డబ్బులు వసూళు చేసింది.
తాజాగా తమిళన నాట విడుదలైన స్టార్ హీరోల సినిమాల్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఈ మూవీ నాలుగో స్థానంలో నిలిచింది. విజయ్ దళపతి ‘వారిసు’ తొలి రోజున రూ. 47.5 కోట్లు సాధించింది. అజిత్ ‘తునివు’ రూ. 41 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ధనుష్ ‘వాతి’(సార్) చిత్రం తమిళంలో రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. శింబు నటించిన ‘పత్తు తలా’ సినిమా సుమారు రూ. 10 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.
ఈ సినిమా విడుదల సందర్భంగా చెన్నైలోని ప్రముఖ థియేటర్ రోహిణి యాజమాన్యం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు అందరిలాగే ఓ ట్రైబల్ ఫ్యామిలీ కూడా వచ్చింది. వారు టికెట్ కొనుగోలు చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, థియేటర్ యాజమాన్యం వారిని లోపలికి పంపించేందుకు అనుమతించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గిరిజన కుటుంబంపై ఎందుకు వివక్ష అంటూ నెటిజన్లు మండిపడ్డారు. యాజమాన్యం తీరు తూర్పారబడుతూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అజిత్ కుమార్, తలపతి విజయ్, రజనీకాంత్ అనేక ఇతర ప్రముఖ సూపర్ స్టార్‌ల చిత్రాల ఫస్ట్ డే ఫస్ట్ షోలకు చెన్నై రోహిణి థియేటర్ చాలా ఫేమస్. అలాగే తాజాగా శింబు ‘పత్తు తల‘ కూడా ఇక్కడ విడుదలైంది.
Read Also: 'జో బిడెన్ - దలైలామా' ముద్దులు, క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!
Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్
అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?
Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం