అన్వేషించండి

Mahesh Babu Off To Paris : అబ్బాయితో కలిసి పారిస్ వెళ్లిన మహేష్ - ఆల్రెడీ సితార, నమ్రత...

సూపర్ స్టార్ మహేష్ బాబు పారిస్ వెళ్లారు. అబ్బాయి గౌతమ్, ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు.

కుమారుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni)తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పారిస్ వెళ్లారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తండ్రి తనయులు ఇద్దరూ కనిపించారు. రెండు వారాల పాటు మహేష్ హాలిడే ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ మూడో వారంలో ఇండియాకి రిటర్న్ కానున్నారు. 

ఆల్రెడీ పారిస్ (Paris)లో...
నమ్రత & సితార పాప!
సాధారణంగా మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి విదేశాలకు వెళుతూ ఉంటారు. బట్, ఫర్ ఎ చేంజ్... ఈసారి ఇంట్లో మహిళలు ముందు వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే మహేష్ సతీమణి నమ్రత, కుమార్తె సితార పారిస్ వెళ్లారు. ఇప్పుడు వాళ్ళతో తండ్రి తనయులు జాయిన్ అవుతారు. 

త్రివిక్రమ్ సినిమా షూటింగులో మహేష్ బాబు బిజీ బిజీగా ఉండటంతో ఆయనకు ముందుగా వెళ్ళడం కుదరలేదు. పరీక్షలు ఉండటంతో గౌతమ్ ఇక్కడ కూడా ఇండియాలో ఉండిపోయారని సమాచారం. ఇప్పుడు ఇద్దరూ వీలు చూసుకుని పారిస్ వెళుతున్నారు. 

త్రివిక్రమ్ సినిమా ఎంతవరకు వచ్చింది?
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సుమారు పదమూడేళ్ళకు మహేష్ బాబు, మాటల మాంత్రికుడు  & గురూజీ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరింది. SSMB 28 సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ముగిసింది. మహేష్, పూజా హెగ్డే (Pooja Hegde) పాల్గొనగా... కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. 

ఇంతకు ముందు 'మహర్షి'లో మహేష్ సరసన పూజా హెగ్డే నటించారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్, పూజా హెగ్డే హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల మరో కథానాయిక.

నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?
ఏప్రిల్ 21న ఎస్ఎస్ఎంబి 28 లేటెస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో మహేష్ కూడా జాయిన్ అవుతారని, ఆ లోపు ఇండియా వస్తారని సమాచారం. కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మహేష్, త్రివిక్రమ్ నిర్విరామంగా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. సాంగ్స్ మినహా సినిమాలో మెజారిటీ టాకీ పార్ట్, భారీ యాక్షన్ సీన్లు చాలా వరకు తీసేశారు. పాటల కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read జై భజరంగ్ బలి - ప్రభాస్ 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ మే 31న జన్మించారు. ప్రతి ఏడాది ఆ రోజున తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కృష్ణ జయంతి (Krishna Death Anniversary)కి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read దుబాయ్‌లో ఉపాసన సీమంతం - భార్యతో రామ్ చరణ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Embed widget