అన్వేషించండి

Naga Vamsi Speech War 2 Event: ఎన్టీఆర్ ఇండియాలో కాలర్ ఎగరేయాలి... అదీ అభిమానుల బాధ్యత - 'వార్ 2' ఈవెంట్‌లో నాగవంశీ

War 2 Pre Release Event: 'వార్ 2' ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఎన్టీఆర్ అన్న దేశవ్యాప్తంగా కాలర్ ఎగరేసే బాధ్యత అభిమానులదేనని ఆయన వివరించారు. 

'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా చూస్తుంటే తారక్ అన్న (ఎన్టీఆర్)ను హిందీ సినిమాకు తీసుకు వెళుతున్నట్టు లేదని... హృతిక్ రోషన్ గారిని తెలుగు సినిమాకు తీసుకు వస్తున్నట్టు ఉందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'వార్ 2'ను తెలుగు రాష్ట్రాల్లో ఆయన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (War 2 Pre Release Event)లో సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదని నాగవంశీ తెలిపారు. 

ప్రోపర్ తెలుగు సినిమాలా ఉంటుంది!
హిందీ డబ్బింగ్ సినిమా తరహాలో 'వార్ 2' ఉండదని, ప్రోపర్ తెలుగు సినిమా అన్నట్టు ఉంటుందని నాగవంశీ చెప్పారు. లిప్ సింక్ సహా ప్రతిదీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పారు. 

''థియేటర్ల నుంచి 'వార్ 2' చూసి బయటకు వచ్చేటప్పుడు అయాన్ ముఖర్జీ గారు తెలుగు దర్శకులు ఇప్పటి వరకు తారక్ అన్నను చూపించిన దానికంటే బాగా చూపించారని మీరే (ప్రేక్షకులు) గర్వంగా ఫీలవుతారు. మనం హృతిక్ రోషన్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వాగతిస్తున్నట్టు సినిమా ఉంటుంది'' అని నాగవంశీ అన్నారు. 

'దేవర' కంటే పదింతలు ఓపెనింగ్ రావాలి!
 గతేడాది సెప్టెంబర్ 27న 'దేవర' మీద చూపించిన ప్రేమకంటే పదింతలు ఎక్కువ ప్రేమ 'వార్ 2' మీద అభిమానులు చూపించాలని నాగవంశీ కోరారు.

Also Read: కటౌట్స్ కాదు... మాస్ మూమెంట్స్ - 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హంగామా

''గుర్తు పెట్టుకోండి... తారక్ అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే సెప్టెంబర్ 27 కంటే పదింతలు ఎక్కువ ప్రేమ చూపించాలి. హిందీ బాక్సాఫీస్ నెట్ ఎంత ఉంటుందో దాని కంటే ఒక్క రూపాయి నెట్ మనం ఎక్కువ పెట్టాలి. 'దేవర' కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకు రావాల్సిన బాధ్యత అభిమానులది. మన కోసం అన్న కాలర్ ఎగరేశారు. ఇప్పుడు అన్నయ్య ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి'' అని నాగవంశీ మాట్లాడారు. సినిమా చూసి బాగా వచ్చిందని, సినిమా చూశాక ఎవరూ డిజప్పాయింట్ అవ్వరని, షాక్ అవుతారని, అద్భుతమైన తెలుగు సినిమా చూశామని అనిపించకపోతే ఇంకెప్పుడూ మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగనని ఆయన తెలిపారు.   

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ముందు నాకు భయం!
స్పీచ్ స్టార్ట్ చేయడానికి ముందు తనకు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముందు మాట్లాడాలంటే భయమని నాగవంశీ తెలిపారు. ''అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు నోటి లోనుంచి మాట రాదో వాళ్లిద్దరూ ఇవాళ కింద ఉన్నారు. మీరు అరిస్తే (ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి) వచ్చే మాటలు కూడా రావు. నాకు త్రివిక్రమ్ గారి ముందు గానీ, తారక్ అన్న ముందు గానీ మాట్లాడాలంటే భయం. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే మాట్లాడతా'' అని నాగవంశీ చెప్పారు.

Also Read: అమ్మకు అంకితం... తల్లి మీద సాయి దుర్గా తేజ్ ప్రేమ, గౌరవానికి ఫిల్మ్ ఫేర్ సలామ్

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget