అన్వేషించండి

War 2 Trailer: హోరాహోరీగా ఎన్టీఆర్, హృతిక్ వార్ - 'వార్ 2' ట్రైలర్ అదుర్స్

War 2 Trailer Reaction: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది. స్టార్స్ మధ్య వార్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

NTR Hrithik Roshan's War 2 Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్, పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇద్దరు భారీ స్టార్ల మధ్య వార్ చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ట్రైలర్ అదుర్స్

'నేను ప్రమాణం చేస్తున్నాను. నా పేరును, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతాను. ఓ ఊరు పేరు రూపం లేని నీడలాగా...' అనే హృతిక్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నేను మాటిస్తున్నా. ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను.' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఇద్దరి మధ్య హోరా హోరీ వార్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ఇప్పుడు నేను మనిషిని కాదు. యుద్ధంలో ఆయుధాన్ని. చస్తా లేదా చంపుతా' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. 'ఆయన సోల్జర్, నువ్వు సోల్జర్ అండ్ దిస్ ఈస్ వార్' అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుండగా... అసలు ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా 'వార్ 2' మూవీ ఆరో చిత్రంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై అధికారిగా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

ఫస్ట్ ఇండియన్ సినిమాగా...

'వార్ 2' క్రేజ్ దృష్ట్యా ఆడియన్స్‌కు ఓ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ మూవీని డాల్బీ అట్‌మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో డాల్బీ అట్‌మోస్ సౌండ్‌ను ఎంజాయ్ చేయనున్నారు. భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించనుంది. అటు విదేశాల్లోనూ మ్యాగ్జిమమ్ అధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ థియేటర్లలోనే సినిమాను ప్రదర్శించనున్నారు.

డిఫరెంట్ ప్రమోషన్స్

యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడు మూవీ ప్రమోషన్స్‌లో డిఫరెంట్ పంథాను ఎంచుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు ట్రైలర్‌తో అది పదింతలైంది. ప్రమోషన్లలో భాగంగా ఫ్లైట్ స్మోక్‌తో 'ఎన్టీఆర్', 'వార్ 2' అంటూ పేర్లు రాయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో వచ్చిన 'వార్'కు సీక్వెల్‌గా ఈ మూవీ రానుంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
AK 47 Release Date: గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget