NTR War 2: బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ - 'వార్ 2' తర్వాత తారక్ ప్లాన్ ఇదే
NTR Bollywood Plans: 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే, 'వార్ 2' ఆయనకు స్ట్రయిట్ హిందీ ఫిల్మ్. ఆ తర్వాత ఆయన కనిపించే బాలీవుడ్ ఫిల్మ్స్ లైనప్ భారీగా ఉండబోతోంది.
NTR to do more films in YRF Spy Universe: 'ఆర్ఆర్ఆర్: రుద్రం రణం రుధిరం' సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకున్నారు. తన నటనతో మెప్పించారు. అయితే... 'వార్ 2' ఆయనకు ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా. అందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. 'వార్'లో హృతిక్ కాకుండా బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ కూడా హీరోగా నటించారు. అయితే... పతాక సన్నివేశాల్లో ఆయన పాత్రకు ఎండ్ కార్డ్ వేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ పాత్రకు 'వార్ 2' చివర్లో శుభం కార్డు వేస్తారనే ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
టైగర్... పఠాన్... కబీర్... త్వరలో ఎన్టీఆర్ రోల్!
యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో 'వార్ 2' తెరకెక్కుతోంది. దీనికి ముందు 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' చిత్రాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ (టైగర్), హృతిక్ రోషన్ ('వార్'లో కబీర్), షారుఖ్ ఖాన్ (పఠాన్) క్యారెక్టర్లు బేస్ చేసుకుని స్పై యూనివర్స్ ఫిల్మ్స్ తీస్తున్నారు నిర్మాత, రచయిత ఆదిత్య చోప్రా. ఆ తరహాలో 'వార్ 2'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ బేస్ చేసుకుని మరిన్ని స్పై ఫిలిమ్స్ చేయాలని ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నారట. 'వార్ 2'కు మాత్రమే ఎన్టీఆర్ క్యారెక్టర్ పరిమితం కాదని, యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
'వార్ 2'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏమిటంటే?
NTR role in War 2 revealed: 'వార్' సినిమాలో టైగర్ ష్రాఫ్ డ్యూయల్ రోల్ చేశారు. అందులో ఒకటి ఇండియన్ స్పై, రా ఏజెంట్ రోల్ ఖాలిద్ రహ్మాని ఒకటి. ఇండియన్ రాకి ఎదురు తిరిగే ఏజెంట్ రోల్ మరొకటి చేశారు. అంటే... ఖాలిద్ తరహాలో కనిపించడం కోసం ఆయనలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న క్యారెక్టర్.
Also Read: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? - ఇదీ గోపీచంద్ రియాక్షన్
'వార్ 2' విషయానికి వస్తే... ఇండియన్ స్పై ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారట. హృతిక్ రోషన్, ఆయనకు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయని టాక్. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలైంది. ఓ నెల తర్వాత ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...
War 2 Release Date: 'వార్ 2' సినిమాను వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వేకప్ సిద్', 'ఏ జవానీ హై దివాని', 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ నటిస్తున్నారు.
'వార్ 2' కంటే ముందు 'దేవర' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
Also Read: అఖండతో పోలిస్తే మంచిదే! కానీ... 'భీమా'లో అఘోరాలపై గోపీచంద్ ఏం చెప్పారంటే?