NTR Craze At Israel: ఇజ్రాయెల్ మీడియాలో ఎన్టీఆర్‌పై ఆర్టికల్ - నెట్టింట వైరల్
Viral article about NTR: ఎన్టీఆర్ గురించి ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన ఒక కథనం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ, అదేంటో మీరూ చూడండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటింది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదల తర్వాత ఆయన నటన గురించి దేశం మొత్తం మాట్లాడింది. అదే సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన తర్వాత... ఇప్పుడు ప్రపంచం మాట్లాడుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు సినిమాను ప్రశంసిస్తున్నారు. రీసెంట్‌గా ఒక ఇజ్రాయెల్ పత్రికలో సినిమా గురించి కథనం రాశారు. అందులో కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా రాశారు. కథనంతో పాటు ప్రచురించిన రెండు ఫొటోలూ ఎన్టీఆర్‌వే కావడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' పతాక సన్నివేశాల్లో బండిని రెండు చేతులతో లిఫ్ట్ చేసే ఫొటో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు సంతోషంలో ఉన్నారు.
Also Read: 'సుడుల్' రివ్యూ: శ్రియా రెడ్డి, ఐశ్వర్యా రాజేష్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా ప్రారంభం కానుంది.
Israel media about @tarak9999 Anna 🔥#RRRMovie #ManOfMasessNTR #JrNTR #komurambheem pic.twitter.com/flhG5LZxrm
— nandu karumuri (@NanduKarumuri) June 18, 2022
#RRR scenes are extremely well-tailored. Especially this one. #JrNTR is OUTSTANDING.#RRRMovie @tarak9999 pic.twitter.com/q1MFWvzVff
— Nishit Shaw (@NishitShawHere) June 13, 2022
View this post on Instagram