అన్వేషించండి

Sr NTR Jayanthi - Telugu Heritage Day: తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ జయంతి, అమెరికాలో ఫ్రిస్కో మేయర్ కీలక ప్రకటన

తెలుగు వారంతా గర్వించే ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత నటసార్వభౌముడికి అరుదైన ఘనత దక్కింది. ఆయన శతజయంతిని తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారు అమెరికాలోని ఫ్రిస్కో మేయర్.

నందమూరి తారక రామారావు. తెలుగు వారు గర్వించే మహా నటుడు. ప్రజారంజక పాలన అందించిన రాజకీయనాయకుడు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నట సార్వభౌముడు.  తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి మెప్పించిన ఘనుడు. ఎన్నో చిత్రాలకు నిర్మాతగా, మరెన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించి అద్భుత సినిమాలను తెరకెక్కించిన సినీ దార్శనికుడు.  పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలు అనే తేడా లేకుండా అన్నింటా అద్భుతంగా రాణించిన నటుడు.  రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రల్లో మేటి నటన కనబరిచి తెలుగు వారి హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. 

తెలుగు రాజకీయల్లో ఎన్టీఆర్ కీలక ముద్ర

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అచిర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామారవు.  1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన, కేవలం 9 మాసాల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన రాజకీయ ధీరుడు ఆయన. మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అత్యధిక కాలం ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన చరిత్రను లిఖించారు. తన పాలనా కాలంలో ఎన్నో అత్యున్నత విధానాలకు రూపకల్పన చేశారు. ప్రజలు మెచ్చే పాలన అందించారు. చివరకు రాజకీయ చదరంగంలో ఓడిపోయి, గుండెపోటుతో కన్నుమూశారు.

తెలుగు హెరిటేజ్ డే గా ఎన్టీఆర్ జయంతి  

మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేడులకు వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర మేయర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు ప్రజలందరూ అన్నగారిగా భావించి గౌరవించే  నందమూరి తారకరామారావు పుట్టిన మే 28వ తేదీని ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్ డే గా నిర్వహించనున్నట్లు ఆ నగర మేయర్ జెఫ్ చేనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలందరూ ముందుకు వెళుతున్నారని, ఆయన శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ తరఫున ఆయనకు గౌరవార్థంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఒక నగర మేయర్   తెలుగు జాతి గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడికి గౌరవార్థంగా తెలుగు హెరిటేజ్ డే గా ఆయన జయంతిని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రజలు కొనియాడుతున్నారు.

అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షల తెలుగు ప్రజలు

నిజానికి అమెరికాలో చాలా మంది తెలుగువారు ఉన్నారు. ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్లినవారితో పాటు అక్కడే నివాసం ఉంటున్న వారి సంఖ్య భారీగా నే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో నాలుగున్నర లక్షల మంది తెలుగు వారు నివసిస్తున్నారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. పలు రంగాల్లో తెలుగు వారు ప్రతిభ కనబర్చుతున్నారు. అలాంటి తెలుగువారు అమితంగా ఇష్టపడే ఎన్టీఆర్ కోసం  ప్రిస్కో నగర మేయర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.  తెలుగు నటుడికి అరుదైన గుర్తింపు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు చెప్తున్నారు.

Read Also: అట్టహాసంగా పరిణీతి చోప్రా - రాఘవ చద్దా నిశ్చితార్థ వేడుక, నెట్టింట్లో ఫోటోలు వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha | ప్రచారంలో మాధవిలతకు ఝలక్.. వైరల్ వీడియో | ABP DesamGems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABPLoksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP DesamHappy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Embed widget