Nishad Yusuf: మాలీవుడ్‌లో విషాదం... సూర్య 'కంగువ' ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి
Nishad Yusuf Death: తమిళ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మలయాళ చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యంగ్ ఎడిటర్, ఎంతో ప్రతిభవంతునిగా పేరు తెచ్చుకున్న నిషాద్ యూసఫ్ (Nishad Yusuf editor) మృతితో ఇవాళ మాలీవుడ్ నిద్ర లేచింది. ఆయన మృతితో ఇటు తమిళ చిత్ర పరిశ్రమలో సైతం విషాద ఛాయలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎడిటర్ నిషాద్ యూసఫ్ ఇకలేరు!
Nishad Yusuf Found Dead In Kochi: మలయాళంలో అనేక చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన నిషాద్ యూసఫ్ బుధవారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయస్సు 42 ఏళ్ళు. చిన్న వయసులో నిషాద్ మృతి చెందడం పట్ల, అసలు ఎందుకు మృతి చెందారో తెలియదు పరిస్థితిలో మాలీవుడ్ మూగబోయింది.
కేరళలోని కొచ్చిలో గల పనంపిళ్లై నగర్ (ఏరియా)లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నిషాద్ యూసఫ్ నివాసం ఉంటున్నారు. ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఆయన విగత జీవిగా కనిపించారని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆయన మృతికి గల కారణాలు తెలుసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిషాద్ మృతిని 'ది ఫిల్మ్ ఎంప్లాఈస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ' (ఫెక్కా) - దర్శకుల సంఘం సోషల్ మీడియాలో ధృవీకరించింది.
నిషాత్ మృతికి కారణం ఏమిటి?
Reason for death of editor Nishad Yusuf: మలయాళ పరిశ్రమతో పాటు ఇప్పుడు తమిళ ప్రేక్షకుల మదిలో ఉన్న ఏకైక ప్రశ్న... 'ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతికి కారణం ఏమిటి?' అని! తెలుగు ప్రేక్షకులకు సైతం కలిసిన మలయాళ హీరో టోవినో థామస్ నటించిన 'తళ్లుమాల' సినిమాకు ఉత్తమ ఎడిటర్ అవార్డును కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిషాద్ యూసఫ్ అందుకున్నారు. మలయాళంలో పలు సినిమాలకు ఆయన పని చేశారు. అతని తీరు పట్ల విమర్శకులతో పాటు పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ మృతితో మలయాళ పరిశ్రమ షాక్ తింది.
Also Read: కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్... ట్రోలర్స్‌కు దిమ్మ తిరిగేలా నాగ చైతన్య స్పీచ్
సూర్య కంగువ సినిమాకు ఆయనే ఎడిటర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కంగువ'కి నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సూర్యతో పాటు విలన్ రోల్ చేసిన బాబీ డియోల్, చిత్ర దర్శకుడు శివతో కలిసి దిగిన ఫోటోలను ఇటీవల ఆయన తన సోషల్ మీడియా ఎకౌంట్లలో షేర్ చేశారు. నవంబర్ 14న 'కంగువ' థియేటర్లోకి రానున్న సంగతి తెలిసింది. ఆ సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు నిషాద్ మృతి ఆ చిత్ర బృందానికి పెద్ద షాక్ అని చెప్పాలి.
View this post on Instagram
మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న 'బాసక్క', మోహన్ లాల్ - తరుణ్ మూర్తి సినిమాతో పాటు నెల్సన్ 'అలపూజ జింఖానా' సినిమాలకు నిషాద్ యూసఫ్ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మృతితో ఆ సినిమాలకు వేరే ఎడిటర్ చేసుకోవాలి. సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించనున్న సినిమాకు సైతం ఆయనను ఎడిటర్ కింద తీసుకున్నారు.
Also Read: చిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?