Nikhil Siddharth's SPY Glimpse: హిమాలయాల్లో భారతీయ గూఢచారిగా నిఖిల్ స్టైలిష్ యాక్షన్ - 'స్పై' గ్లింప్స్ చూశారా?
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న 'స్పై' సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
హిమాలయాల్లో భారతీయ గూఢచారిగా యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్' వంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బిహెచ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'స్పై'. ఈ రోజు గ్లింప్స్ విడుదల చేశారు. అందులో హీరోను పరిచయం చేశారు.
హిమాలయాల్లో... మంచు మధ్య జాగ్రత్తగా దాచిన గన్స్ కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన అన్వేషణ, ఆ తర్వాత స్టైలిష్ బైక్ మీద వెళ్లడం, షూట్ చేయడం... గ్లింప్స్ అంతా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. గ్లింప్స్ చివర్లో మంచు తవ్వడం కోసం నిఖిల్ నిలబడిన షాట్ కూడా బావుంది.
ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి 'స్పై'ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని చిత్ర బృందం పేర్కొంది. ఫేమస్ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ సారథ్యంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.
Also Read: 'ఎక్స్ట్రా జబర్దస్త్'ను సుడిగాలి సుధీర్ వదిలేసినా, అతడిని వదలడం లేదేంటో?
బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమఠం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవి వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2022 దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు.
Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి
View this post on Instagram