Niharika Konidela: నిహారికకు మళ్ళీ పెళ్లి... విడాకులపై స్పందించిన నాగబాబు
Naga Babu on Niharika divorce: కుమార్తె నిహారికా కొణిదెల విడాకుల పట్ల మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన జడ్జిమెంట్ రాంగ్ అని ఆయన తెలిపారు. మళ్లీ నిహారిక పెళ్లి చేసుకుంటుందని చెప్పారు.

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) తన కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) పెళ్లిళ్లపై స్పందించారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. అయితే చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక కొన్ని రోజులు వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారు. తన కుమార్తె సంసార జీవితంలో పట్ల ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు.
అమ్మాయి ఓకే అన్నాక పెళ్లి చేశాం...
కానీ మా జడ్జిమెంట్ తప్పు అయింది!
లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటానని వరుణ్ తేజ్ అడిగినప్పుడు ''నువ్వు ఆమెతో సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావు కదా!?'' అని అడిగానని నాగబాబు తెలిపారు. తామిద్దరం హ్యాపీగా ఉంటామని వరుణ్ తేజ్ చెప్పిన తర్వాత పెళ్లి జరిపించినట్లు వివరించారు. పెళ్లి విషయంలో వరుణ్ జడ్జిమెంట్ రైట్ అయిందని, కానీ నిహారిక పెళ్లి విషయంలో తన జడ్జిమెంట్ రాంగ్ అయిందని నాగబాబు తెలిపారు.
''నిహారిక పెళ్లి మేము చేసిన తప్పు. మేము చూసిన సంబంధం నిహారిక చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేయలేదు. మ్యాచ్ తీసుకు వచ్చిన తర్వాత తాను ఓకే అన్నాక పెళ్లి చేశాం. అయితే అబ్బాయితో మా అమ్మాయికి సింక్ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ విడిపోతామని చెప్పినప్పుడు కలిపేందుకు నేను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. తమకు ఇష్టం లేదని చెప్పారు నేను సరేనని ఊరుకున్నాను'' అని నాగబాబు వివరించారు.
Also Read: బ్రాహ్మణులు రేపిస్టులా? '8 వసంతాలు' టీంపై మీడియా ఫైర్... సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన డైరెక్టర్!
పిల్లల సంతోషమే నాకు ముఖ్యం...
భవిష్యత్తులో నిహారికకు మళ్లీ పెళ్లి!
పిల్లల కెరీర్ విషయంలో తాను అస్సలు తలదూర్చనని నాగబాబు స్పష్టం చేశారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది తనకు ముఖ్యమని సంతోషంగా లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ వేస్ట్ అని ఆయన చెప్పారు. పిల్లల సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాతగా నిహారిక సినిమాలు చేస్తుందని, కొన్ని రోజుల పోయిన తర్వాత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందని నాగబాబు పేర్కొన్నారు. సో నిహారికకు మళ్లీ పెళ్లి జరగడం ఖాయం అన్నమాట.
Also Read: డ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్ట్... చెన్నైలో రాజకీయ నాయకుడికీ లింకులు?





















