Niharika Konidela: అకిరా నందన్‌ను నేనే లాంచ్ చేస్తా - పవర్ స్టార్ కొడుకు ఎంట్రీపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల.. పవన్ కల్యాణ్ కొడుకు అకీరా సినిమా ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె అకీరా సినిమా ఎంట్రీ గురించి మాట్లాడారు.
Niharika Konidela About Akiranandan Movie Entry: నిహారిక కొణిదెల మెగా డాటర్. నటి మాత్రమే కాదు... నిర్మాత కూడా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఎన్నో వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ చేస్తున్నారు నిహారిక. ఇక ఇప్పుడు ఆమె సమర్పించిన 'సాగు' అనే ఇండిపెండెంత్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమా ఎంట్రీకి సంబంధించి నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అకీరా సినిమా ఎంట్రీ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అకీరా ఎంట్రీ ఎప్పుడు?
అకీరా సినిమా ఎంట్రీ గురించి హోస్ట్ అడిగిన ప్రశ్నకి నిహారిక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. "అకీరా.. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. అకీరా చాలా మంచి మ్యూజీషియన్. పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. సౌండ్ డిజైనింగ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడూ సినిమాల్లోకి వస్తావా అని డైరెక్ట్ గా అకీరాను అడగలేదు. ఎందుకంటే చాలా యంగ్ కదా. ఆ ప్యాషన్ పుట్టడానికి కూడా టైమ్ పట్టొచ్చు. ఒకవేళ అకీరా ఇంట్రెస్ట్ గా ఉండి ఈ ఫిల్డ్ లోకి వస్తానంటే.. కచ్చితంగా పింక్ ఎలిఫెంట్ లో అకిరాను లాంచ్ చేస్తాను" అని చెప్పారు నిహారిక. దీంతో నిహారిక కామెంట్స్ వైరల్ గా మారాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక అకీరా విషయానికొస్తే.. రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు అకీరాకు సంబంధించి పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అకీరా మ్యూజిక్ ప్లే చేస్తున్న వీడియోలు, కంపోజ్ చేసిన పాటలను షేర్ చేస్తూ ఉంటారు ఆమె. ఈ ఏడాది సంక్రాంతికి జరిగిన కొణిదెల ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో కూడా అకీరా ప్లే చేసిన ఒక పాట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ఫ్యామిలీ పెద్ద కోడలు ఉపాసన దాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
తమిళ్ సినిమాలో నిహారిక..
ఇక గతంలో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన నిహారిక అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఆమె చేసిన సినిమాలు హిట్ అవ్వలేదు. ఆ తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చిన నిహారిక ఇప్పుడు మళయాల సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రస్తుతం 'మద్రాస్ కారన్' సినిమాలో నటిస్తున్నారు నిహారిక. అయితే, తెలుగులో మంచి స్క్రిప్ట్స్ తో వస్తే నటిస్తానని చెప్తున్నారు ఆమె. వంశీ తుమ్మల, హారిక బల్ల జంటగా నటించిన సినిమా 'సాగు'.
ఇదొక ఇండిపెండెంట్ ఫిల్మ్. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. మార్చి 4న 16 ఓటీటీల్లో విడుదలైంది. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో నిహారిక సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, విఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎంఐ, ఎల్.జి, వన్ ప్లస్ టవీ, క్లౌడ్ వాకర్, వాచోలో స్ట్రీమ్ అవుతోంది.
Also Read: హద్దుమీరిన అభిమానం, ‘జై అల్లు అర్జున్’ అనలేదని ఆ హీరో ఫ్యాన్స్ దాడి