Chandramukhi 2 OTT: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Chandramukhi 2 OTT Release Date: సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలయిన ‘చంద్రముఖి 2’.. ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది అనేదానిపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Chandramukhi 2 OTT Release Date: కొన్ని క్లాసిక్ సినిమాలను టచ్ చేయకూడదు అని అంటుంటారు. అందుకే ఫస్ట్ పార్ట్ హిట్ అయినంత ఈజీగా దాని సీక్వెల్స్ హిట్ అవ్వవు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా విడుదలయిన ‘చంద్రముఖి 2’ కూడా దీనికి ఉదాహరణే. కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అంత మెరుగైన కలెక్షన్స్ కనిపించకపోయినా.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు మాత్రం భారీగా డిమాండ్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ‘చంద్రముఖి 2’ గురించి అప్పుడే వార్తలు వైరల్ అయ్యాయి.
‘చంద్రముఖి 2’కు అదిరిపోయే కలెక్షన్స్
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ ఒక పూర్తిస్థాయి హారర్ చిత్రంగా తెరకెక్కింది. అప్పట్లో తమిళ చిత్రాలకు తెలుగులో హైప్ క్రియేట్ అయ్యింది ‘చంద్రముఖి’తోనే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తమిళంలో ఈ మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుగులో కూడా అంతే హిట్ అయ్యి కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు పి వాసు. దానికోసం రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లాంటి నటీనటులను సెలక్ట్ చేసి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు. ‘చంద్రముఖి 2’కు సంబంధించి టాక్ ఎలా ఉన్నా.. విడుదలయిన వారంలో దేశవ్యాప్తంగా రూ.28 కోట్లను కలెక్ట్ చేసింది.
‘చంద్రముఖి’ రేంజ్‌లో సీక్వెల్ లేదు
‘చంద్రముఖి 2’కు పోటీగా ‘ది వ్యాక్సిన్ వార్’, ‘ఫుక్రే 3’లాంటి హిందీ చిత్రాలు విడుదలయినా కూడా దాని కలెక్షన్స్ మాత్రం కాస్త స్థిరంగానే ఉన్నాయి. కానీ ‘చంద్రముఖి’ రేంజ్‌లో సీక్వెల్ ఇంప్రెస్ చేయలేకపోయిందని చాలామంది ప్రేక్షకులు.. తమ అభిప్రాయాన్ని ఓపెన్‌గానే చెప్పారు. ఫస్ట్ లుక్ దగ్గర నుండి ఈ సీక్వెల్‌ను ట్రోల్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. అయినా కూడా ‘చంద్రముఖి 2’ కలెక్షన్స్ విషయంలో మాత్రం బాగానే మ్యానేజ్ చేయగలిగింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో కూడా ఈ మూవీ పరవాలేదనిపించింది.
ఓటీటీలో వచ్చేది అప్పుడే
‘చంద్రముఖి 2’ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనికోసం మూవీ టీమ్‌కు నెట్‌ఫ్లిక్స్.. రూ.8 కోట్లు ఆఫర్ చేసిందట. మామూలుగా ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిన 6 నుండి 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదు కాబట్టి నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో.. ‘చంద్రముఖి 2’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వనుందని సమాచారం. ఓవైపు ‘చంద్రముఖి 2’ రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే కంగనా రనౌత్.. తన తరువాతి సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే ‘ఎమర్జెన్సీ’ని విడుదలకు సిద్ధం చేసిన కంగనా.. తాజాగా ‘తేజస్’ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఎప్పుడూ బోల్డ్ పాత్రలకే ఓటు వేసే ఈ బాలీవుడ్ క్వీన్.. తన తరువాతి రెండు చిత్రాల్లో కూడా వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించనుంది. ముఖ్యంగా ‘తేజస్’లో తను ఒక పైలెట్ పాత్రలో కనిపించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా అక్టోబర్ 8న ‘తేజస్’ ట్రైలర్ విడుదల కానుంది. అక్టోబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial