Distributor Hari Death: టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి
Producer Hari Death News: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులో యువ నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మరణించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆదివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్‌గా చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు పరిచయం అయిన 'నెల్లూరు' హరి (Nellore Distributor Hari) హఠాత్తుగా మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
గుండెపోటుతో 'నెల్లూరు' హరి మృతి
'నెల్లూరు' హరిగా సుపరిచితులైన హరి పూర్తి పేరు గుజ్జలపూడి హరికుమార్ (Gujjalapudi Hari Kumar). ఆయన వయసు 46 సంవత్సరాలు. ఈ రోజు (మే 24వ తేదీ, 2026) ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళని సమాచారం.
తెలుగు చిత్రసీమలో హరికి మంచి పేరు ఉంది. పంపిణీదారుడిగా ఆయన ఎన్నో హిట్ సినిమాలను హరి పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినదీ ఆయనే. అదొక్కటే కాదు... ఎన్నో హిట్ సినిమాల వెనుక ఆయన ఉన్నారు. నెల్లూరులో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే హరి పేరు చెబుతారంతా. అటువంటి మనిషి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
హరి కేవలం డిస్ట్రిబ్యూషన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. పంపిణీ రంగం నుంచి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. విశాల్, తమన్నా జంటగా నటించిన 'ఒక్కడొచ్చాడు'ను తెలుగులో విడుదల చేశారు. విశాల్ సినిమాలు సహా తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల చేశారు. నితిన్ హీరోగానూ సినిమాలు చేశారు. అయితే పూర్తి స్థాయి నిర్మాతగా కాకుండా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భాగస్వామ్యంలో చేశారు. దిల్ రాజు, సుధాకర్ రెడ్డితో హరి ఎక్కువగా ట్రావెల్ చేశారు. వాళ్ళ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















