Nayanthara Beyond the Fairytale: నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార డాక్యుమెంటరీ... పెళ్లి ఒక్కటే కాదు, అంతకు మించి - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara Documentary Streaming Date: లేడీ సూపర్ స్టార్ నయనతార మీద పాపులర్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. 'నయనతార: బియాండ్ ది ఫేరీ టేల్' స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
Nayanthara beyond the fairytale release: లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెళ్లి రెండేళ్లు దాటింది. తన పెళ్లికి వచ్చిన అతిథులు చేత ఫోటోలు తీయనివ్వలేదు. అక్కడి వీడియోలు బయటకు రానివ్వలేదు. పెళ్లిని డాక్యుమెంటరీగా రూపొందించి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అది ఏమిటంటే?
నయనతార పెళ్లి కాదు... అంతకు మించి!
Netflix OTT: ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన లేడీ సూపర్ స్టార్ డాక్యుమెంటరీకి 'నయనతార: బియాండ్ ది ఫేరీ టేల్' టైటిల్ ఖరారు చేశారు. అందులో దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి సంగతులు మాత్రమే కాదు... అంతకు మించిన విశేషాలు ఉన్నాయని చెన్నై సమాచారం.
రెండేళ్ల క్రితం నయనతార డాక్యుమెంటరీ టీజర్ విడుదల చేశారు. ఆ వీడియోలో భార్యాభర్తలు విఘ్నేష్, నయన్ తమ బంధం గురించి, అలాగే పెళ్లి పనుల గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీలో చాలా మార్పులు, చేర్పులు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
View this post on Instagram
కథానాయికగా నయనతార ప్రయాణంతో పాటు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కూడా డాక్యుమెంటరీలో డిస్కస్ చేశారట. ఫ్యామిలీ లైఫ్ గురించి నయనతార ఇప్పటివరకు ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు. అందువల్ల ఆవిడ ఏం చెప్పి ఉంటారు అనే ఆసక్తి మొదలైంది. అలాగే, పెళ్లి తర్వాత నయనతార జీవితం గురించి వార్తల్లో నిలిచిన అంశం సరోగసీ. దానిపై విమర్శలు వచ్చాయి. ఆ అంశం నయనతార మాట్లాడతారని తెలిసింది.
Also Read: హీరోయిన్‌తో 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ పెళ్లి - ఆ అమ్మాయి ఎవరు? ఏం సినిమాలు చేసిందో తెలుసా?
నయనతార పుట్టినరోజు సందర్భంగా స్ట్రీమింగ్!
నయనతార డాక్యుమెంటరీని ఆమె బర్త్ డే సందర్భంగా నవంబర్ 18న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తెలియజేసింది. ఈ వీడియో కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
Also Read: హారర్ కామెడీ యూనివర్స్‌లో రష్మిక ప్రేమ కథ... 800 కోట్ల సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత!