Naveen Polishetty : ప్రభాస్ అన్న పెళ్లైన మరుసటి రోజే నా పెళ్లి - ఇండస్ట్రీలో ఆయనే నాకు స్ఫూర్తి... నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Naveen Polishetty Marriage : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న, తాను మంచి ఫ్రెండ్స్ అని... తన అభిమాన హీరోల సినిమాతో పాటు తన సినిమా రిలీజ్ అవుతుండడం సంతోషంగా ఉందన్నారు.

Naveen Polishetty About His Marriage : ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్, డిఫరెంట్ రోల్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విలేజ్ లవ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఈవెంట్‌లో నవీన్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ప్రభాస్ పెళ్లి తర్వాతే...
ఈవెంట్‌లో తన పెళ్లిపై వచ్చిన ప్రశ్నకు స్పందించిన నవీన్... ప్రభాస్ అన్న పెళ్లి అయిన ఒక రోజు తర్వాతే తన పెళ్లి జరుగుతుందని చెప్పారు. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. 'ప్రభాస్ అన్నయ్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. గత మూడేళ్ల నుంచి ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి కామన్ అయిపోయింది. సినిమాలో చారులత పాత్రకు మీనాక్షి సరిగ్గా సరిపోతారు. గత 3 చిత్రాల కంటే అనగనగా ఒక రాజు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మూవీలో నన్ను ప్రేక్షకులు కొత్తగా చూస్తారు. గోదారోళ్ల వెటకారం కలగలిసిన పాత్ర ఇది. ఈ సినిమా చూస్తే గతంలో నేను చేసిన పాత్రలేవీ గుర్తుకురావు.' అని అన్నారు.
Also Read : మాస్ కా దాస్ పొలిటికల్ డ్రామా 'లెగసీ' - రాజకీయ వారసుడిగా విశ్వక్... న్యూ ఇయర్‌లో సెన్సేషనల్ టీజర్
ఫస్ట్ ప్రభాస్ మూవీ...
తనకు మెగాస్టార్ చిరంజీవి ఇన్‌స్పిరేషన్ అని అన్నారు నవీన్. 'సినిమా ఛాన్సెస్ కోసం తిరుగుతున్న టైంలో రూమ్ రెంట్, ఇతర అవసరాల కోసం పెళ్లి సంగీత్‌లకు యాంకరింగ్ చేశా. మా ఫ్యామిలీలో ఏ పెళ్లి జరిగినా వాటి సంగీత్, రిసెప్షన్లకు నేనే హోస్ట్ చేసేవాడిని. ప్రభాస్ అన్నకు మాకు మధ్య పోటీ ఉండదు. మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తి. సగటు మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా తెలుగు ఇండస్ట్రీకి స్టార్ అవ్వొచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తి చిరంజీవి.
నా లాంటి ఎంతోమందికి ఆయనే ఓ ఇన్‌స్పిరేషన్. అలాంటి గురువు సినిమా వస్తుందంటే టెన్షన్ కాదు ఉత్సాహం ఉంటుంది. ఈ సంక్రాంతికి మంచి మూవీస్ వస్తున్నాయి. ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్లి ఫైనల్‌గా నా మూవీ చూస్తాను. అనగనగా ఒక రాజు సరికొత్తగా మెప్పిస్తుంది.' అంటూ చెప్పారు.
ఈ నెల 14న రిలీజ్
కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన 'అనగనగా ఒక రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోనసీమ జిల్లాలో ఓ యువకుడి లవ్ ట్రాక్, సంక్రాంతి సంబరాలతో, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ కలిపి మూవీలో చూపించబోతున్నట్లు గ్లింప్స్, లుక్స్ బట్టి అర్థమవుతోంది. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















