అన్వేషించండి

Colours Swathi: అతన్ని ఇష్టపడుతున్నా, అతను నాకు కావాలి - కలర్స్ స్వాతి మనసు దోచింది ఎవరో తెలుసా?

సుమ అడ్డా ప్రోగ్రాంలో ఈ వారం 'మంత్ ఆఫ్ మధు' మూవీ టీమ్ సందడి చేశారు. ఈ క్రమంలోనే షోలో కలర్స్ స్వాతి తన క్యూట్ మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.

ఈటీవీలో ప్రతి శనివారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న షో 'సుమా అడ్డ'. బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ ఈ షో ని తనదైన హోస్టింగ్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. సుమ ఏ షో చేసినా బుల్లితెర ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు. అలా సుమ అడ్డా షో కి కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రతివారం ప్రత్యేక సెలబ్రిటీ టీం తో సుమా చేసే సందడి అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలపై సుమా వేసే పంచులు, సెటైర్లు మధ్య మధ్యలో ఫన్నీ టాస్కులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం సుమ అడ్డా ఎపిసోడ్లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ టీం సందడి చేసింది.

తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రోమో వైరల్ అవుతుంది. ఒకప్పుడు టీవీలో యాంకర్ గా రాణిస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి చాలా ఏళ్ల తర్వాత సుమ అడ్డా షోలో సందడి చేసింది. ఎప్పటిలాగే గలగల మాటలతో తన స్మైల్ తో ఆకట్టుకుంది. ఒకసారి ప్రోమోని గమనిస్తే.. 'నా షో కి రావడానికి ఎంత టైం పట్టింది నీకు?' అని సుమ స్వాతిని అడగగా, అందుకు స్వాతి బదిలిస్తూ.." మీరే నన్ను అసలు పిలవలేదు. నన్నంతా ఫుల్ ఇగ్నోర్ చేశారు. లవ్ ఇవ్వలేదు నాకు" అంటూ ఎంతో క్యూట్ గా చెప్తుంది. దాంతో సుమ స్వాతిని హగ్ చేసుకుంటుంది.

ఆ తర్వాత నవీన్ గారు ఎలా ఉన్నారు? అని అడిగితే.. "తను ఎప్పుడూ జెంటిల్మెన్’’ స్వాతి చెబుతుంది. దానికి సుమా, ‘‘తను జెంటిల్మెన్ అయితే మరి మన హీరో నాని ఏంటి?’’ అంటూ పంచ్ వేస్తుంది. దాంతో షో లో ఉన్న వారంతా నవ్వేశారు. అనంతరం స్వాతి తో కలిసి సుమ ఓ సీన్ ని రీక్రియేట్ చేశారు. అందులో భాగంగా ‘‘ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే? ఎంతసేపు సుబ్బారావును చేసుకుంటా? సుబ్బారావు చేసుకుంటా? అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అని సుమ అనగానే..  "మరి ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. నీకు అర్థం అవ్వదు" అంటూ ‘అష్టచెమ్మ’ మూవీ సీన్‌ను రీక్రియేట్ చేసింది స్వాతి. దానికి సుమ ఏంటి? సుబ్బారావు పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయా? అని అనగానే షోలో నవ్వులు విరిసాయి.

ఆ తర్వాత షోలో పాల్గొన్న రవికాంత్ కుర్చీలో కూర్చుని ఉండగా "ఈ అబ్బాయి పేరు ఏంటో కనుక్కో?’’ అని సుమ చెబుతుంది. దానికి స్వాతి, 'పేరుతో ఇప్పుడు సంబంధం లేదు పిన్ని. నేను ఆల్రెడీ పడిపోయాను. అంతా అయిపోయింది’’ అని సిగ్గుపడుతూ చెప్తుంది. ఇక ప్రోమో చివర్లో.. "అఫీషియల్‌గా చెప్పేస్తున్నా ఏంటంటే, నాకు రవికాంత్ మీద పెద్ద క్రష్ ఉంది. నాకు రవికాంత్ కావాలి" అని స్వాతి చెప్తుండగా సుమాతో పాటు షోలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 30న ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక 'మంత్ ఆఫ్ మధు' సినిమా విషయానికొస్తే.. శ్రీకాంత్ నాగోతి  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయ నవీలే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget