News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

1920 Movie: హారర్ సినిమా చూడాలంటే చాలా భయం, కానీ ఆ కిక్కే వేరు: నాగార్జున

అవికా గోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్' జూన్ 23న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ను నాగార్జున విడుదల చేస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

FOLLOW US: 
Share:

వికా గోర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ స్వీయ రచనలో రూపొందిన తాజా చిత్రం '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్'. కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్రమ్ భట్ ప్రొడక్షన్ పై రాకేష్ జునేజ, శ్వేతాంబరి భట్, డాక్టర్ రాజ్ కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న థియేటర్స్ లో హిందీతో పాటు తెలుగులో సైతం ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాదులో నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై తెలుగు ట్రైలర్ను లాంచ్ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నాగర్జున మాట్లాడుతూ.. "నేను మహేష్ భట్ గారిని కలిసి దాదాపు 20 ఏళ్లు అయింది. కానీ నా మనసులో ఆయన ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఆయన మనసులో ఉంటానని నమ్ముతున్నాను. నేను ముంబై షూటింగ్స్ కి వెళ్తే మహేష్ భట్ గారి గురించి అడుగుతుంటాను. రీసెంట్ టైమ్స్ లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఆలియాభట్ తో వర్క్ చేశాను. ఆ టైంలో భట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆయన నాకు గురువు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి వాళ్లకు దారి చూపించారు. ఆయన పాటలు చేయించుకునే విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ 'తెలుసా మనసా' పాట చేయించిన విధానం నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే 'జకమ్' లో 'గలిమే ఆజ్ చాంద్ నిక్లా' అనే పాట నా ఆల్ టైం ఫేవరెట్. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 1920 మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక చోట చాలా నిశబ్దమైన సీన్ వచ్చింది. అప్పుడు నిజంగా భయపడ్డాను. అందుకే దాన్ని పోగొట్టుకోవడానికి నవ్వాను. ఇలాంటి సినిమాని పెద్ద స్క్రీన్ పైనే చూడాలి. 1000 కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు హారర్ సినిమాలు చూడాలంటే చాలా భయం. కానీ ఎందుకనో ఈ సినిమా చూడాలనిపిస్తుంది. చూడాలనిపించేలా చేశారు. హారర్ సినిమాలు చూసినప్పుడు వచ్చే కిక్కే వేరు. కృష్ణ ఈ సినిమాని అద్భుతంగా తీశారు. అవికా గోర్ ఈమధ్య డిఫరెంట్ పాత్రలు చేస్తోంది. ఈ మూవీ తన కెరీర్ లోనే చాలా పెద్ద హిట్ అవ్వాలి. జూన్ 23న ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. అందరూ తప్పకుండా చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు నాగార్జున.

ఇక తన స్పీచ్ చివర్లో.. 'రేపు (జూన్16) ఒక పెద్ద సినిమా ప్రభాస్ 'ఆదిపురుష్' వస్తుంది. ప్రభాస్ అండ్ టీ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అందరిని మళ్లీ థియేటర్స్లోకి తీసుకురావాలి' అని చెబుతూ ఆదిపురుష్ కి తన బెస్ట్ విషెస్ తెలిపారు నాగార్జున. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల 'ఘోస్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగార్జున ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనే విషయంపై క్లారిటీ లేదు. ఇటీవల ప్రముఖ రచయిత ప్రసన్న బెజవాడతో సినిమా చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడని టాక్ వినిపించింది. కానీ వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

Published at : 16 Jun 2023 07:06 PM (IST) Tags: Akkineni Nagarjuna King Nagarjuna Nagarjuna 1920 Movie Trailer Launch Nagarjuna Latest Speech

ఇవి కూడా చూడండి

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్